ఓటిటిలో కూడా అదరగోడుతున్న బింబిసార?

Purushottham Vinay
ఓటిటిలో కూడా అదరగోడుతున్న బింబిసార ?

ఎప్పుడెప్పుడా అని జనాలు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘బింబిసార’ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజై సంచలన విజయం సాధించింది. ఏడేళ్ళుగా హిట్టు కోసం పరితపిస్తున్న కళ్యాణ్‌రామ్‌కు ఈ చిత్రం కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. బింబిసారుడిగా, దేవదత్తుడిగా కళ్యాణ్ ద్విపాత్రాభినయంతో అద్భుతమైన నటనను కనబరిచాడు. ఈ చిత్రం కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌కు మంచి బూస్టప్‌ ఇచ్చింది. కాగా తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది.ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ-5’లో ఇప్పుడు బింబిసార చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది.అనూహ్యంగా అన్ని భాషల్లో కూడా ఈ సినిమా సూపర్ రెస్పాన్స్ ని దక్కించుకుంటూ చాలా స్పీడ్ గా దూసుకుపోతుంది.ఫాంటసీ యాక్షన్‌ ఫిలిం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్‌టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.


 హాట్ హీరోయిన్లు సంయుక్తమీనన్‌, కేథరిన్‌ ట్రెసా హీరోయిన్లుగా నటించారు. ఎమ్‌.ఎమ్‌ కీరవాణి బాణీలు సమకూర్చాడు. ఈ చిత్రానికి దాదాపు రూ.15 కోట్ల వరకు థియేట్రికల్‌ బిజినెస్ జరిగింది. ఫుల్‌ రన్‌లో రూ.40 కోట్ల పైగా షేర్‌ను 65 కోట్లకు పైగా గ్రాస్ ని సాధించి సినిమా డబుల్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పెట్టిన పెట్టుబడికి రెండింతలు సినిమా లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాతో టాలీవుడ్‌లో కళ్యాణ్‌రామ్ మార్కెట్ అమాంతం పెరిగింది. ఈ సినిమాని హిందీలో కనుక రిలీజ్ చేసుంటే ఖచ్చితంగా ఈ సినిమాకి బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ లా మంచి పేరు వచ్చిండేది. కళ్యాణ్ రామ్ కూడా పెద్ద పాన్ ఇండియా స్టార్ అయ్యుండేవాడు. ఇక రాబోయే సినిమాలతో పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు.ప్రస్తుతం కళ్యాణ్‌రామ్‌ మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: