అభిరామ్ కోసం అంతర్మధనంలో సురేష్ బాబు !

Seetha Sailaja
టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రభావితం చేసే ఆ నలుగురు వ్యక్తులలో నిర్మాత సురేష్ బాబు ఒకడు అన్నది ఓపెన్ సీక్రెట్. సినిమా నిర్మాణ వ్యయం పై చాల ఖచ్చితంగా వ్యవహరించే సురేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న పరిస్థితులతో రాజీ పడలేక సినిమాలు తీయడం బాగా తగ్గించి వేసాడు.

అయితే అప్పుడప్పుడు కొన్నికొన్ని చిన్న సినిమాలు తీస్తూ తన అభిరుచిని చాటుకుంటున్నాడు. సురేష్ బాబు పెద్దకొడుకు రానా ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు. ఇప్పుడు అదే బాటలో అడుగులు వేయాలని సురేష్ బాబు రెండవ కొడుకు అభిరామ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడి మొదటి సినిమా ‘అహింస’ కు దర్శకుడు తేజా దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ కు మిశ్రమ స్పందన వచ్చింది. దీనితో ఈమూవీని సరైన సమయంలో విడుదలచేయాలని ఆ డేట్ కోసం అన్వేషణ సాగిస్తున్నాడు. అయితే ఆసినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేయాలి అన్న విషయమై సురేష్ బాబు అంతర్మధనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమాను దసరా సీజన్ లో కాని లేదంటే దీపావళి సీజన్ లో కాని విడుదల చేయాలని భావించారు.

అయితే ఈ రెండు పండుగలకు సినిమాల మధ్య పోటీ విపరీతంగా ఉండటంతో ఆ పోటీలో నిలబడటం కష్టం అని ‘అహింస’ రిలీజ్ డేట్ ను సురేష్ బాబు ఫిక్స్ చేయలేక పోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తేజా పరిస్థితి కూడ అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుత తరం దర్శకులతో తేజా పోటీ పడలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో అభిరామ్ కు ఎలాంటి హిట్ ను ఇస్తాడో చూడాలి. వాస్తవానికి ఒక యంగ్ హీరో ప్రస్తుత పరిస్థితులలో నిలబడటం చాల కష్టం. దీనికితోడు యంగ్ హీరోలు చాలామంది తమ టాలెంట్ తో పరుగులు తీస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో అభిరామ్ నిలబడాలి అంటే చాల కష్టపడవలసి ఉంటుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: