"బింబిసారా" మూవీ టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
నటుడిగా , నిర్మాతగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో విజయవంతమైన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కళ్యాణ్ రామ్ "బింబిసారా" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ కి మల్లాడి వశిష్ట దర్శకత్వం వహించగా ,  కేథరిన్ , సంయుక్త మీనన్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఆగస్టు 5 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా బింబిసారా మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు , మొదటి షో కే మంచి టాక్ లభించడంతో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


నైజాం : 11.85 కోట్లు .
సీడెడ్ : 8.10 కోట్లు .
యు ఏ : 4.91 కోట్లు .
ఈస్ట్ : 2.01 కోట్లు .
వెస్ట్ : 1.47 కోట్లు .
గుంటూర్ : 2.26 కోట్లు .
కృష్ణ : 1.60 కోట్లు .
నెల్లూర్ : 96 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి బింబిసారా మూవీ టోటల్ గా 33.16 కోట్ల షేర్ , 53.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో : 2.36 కోట్లు .
ఓవర్ సీస్ లో :  2.40 కోట్లు .
ప్రపంచ వ్యాప్తంగా బింబిసారా మూవీ టోటల్ గా 37.92 కోట్ల షేర్ , 65.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: