14 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గాడ్ ఫాదర్ మూవీ సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీ లలో హీరోగా నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే చిరంజీవి ఈ సంవత్సరం మొదటగా ఆచార్య మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించగా , పూజ హెగ్డే , రామ్ చరణ్ సరసన ఆచార్య మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఆచార్య మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బోల్తా కొట్టింది.

ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలకపాత్రలో నటించగా ,  సత్య దేవ్ విలన్ పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ విడుదల అయ్యి 14 రోజులు పూర్తి అవుతుంది.

ఈ 14 రోజుల్లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. 14 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ పూర్తి అయ్యే సరికి గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 57.66 కోట్ల షేర్ , 104.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించడంతో ,  ఈ మూవీ కి బాలీవుడ్ నుండి కూడా అద్భుతమైన కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికీ కూడా గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: