ఆదిపురుష్: బాహుబలి రికార్డులను చెరిపేసేలా ఉందిగా?

Purushottham Vinay
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కించబడుతున్న పాన్ వరల్డ్ మూవీ "ఆది పురుష్". ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ పై మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు బాగుందని అంటే..మరికొందరు గ్రాఫిక్స్ బాగాలేదని విమర్శలు చేశారు. ఒక కార్టూన్ సినిమా చూసినట్టుందన్నారు. ఇక రామాయణంపై తీసిన ఈ సినిమాలో ప్రభాస్ కు మీసాలు పెట్టడం.. రావణుడిని అల్ట్రామోడల్ గా చూపించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.అయితే ఇన్ని విమర్శలు వచ్చినా సరే 'ఆదిపురుష్' దర్శకుడు ఔంరౌత్ మాత్రం వెనక్కితగ్గలేదు. ప్రభాస్ సైతం ఆరోపణలపై పెద్దగా పట్టించుకోలేదు. ఇన్ని వైపులా నుంచి విమర్శలు చుట్టుముట్టినా సరే.. ఆదిపురుష్ క్రేజ్ మాత్రం తగ్గలేదని నిరూపితమైంది.


తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది గూగుల్ లో సెర్చ్ చేసిన టీజర్ గా 'ఆదిపురుష్' నిలిచింది. గడిచిన 30 రోజులుగా గూగుల్ లో అత్యధికంగా వెతికింది ఆదిపురుష్ గురించే.. అన్ని టాపిక్ ల కంటే కూడా 'ఆదిపురుష్' టీజర్ ముందుంది. గూగుల్ లో +1850 శాతం రేటింగ్ దీనికి రావడం విశేషం. ఇదే టాప్ గూగుల్ సెర్చ్ గా మారింది.జస్ట్ టీజర్ కే అది కూడా ట్రోల్ చేయబడిన టీజర్ కే ఈ రకమైన రెస్పాండ్ వచ్చిందంటే ఇక సినిమా రిలీజ్ అయితే రికార్డులు కొత్తవి క్రియేట్ అవ్వడం ఖాయమే కాకుండా "బాహుబలి" సృష్టించిన రికార్డులు కూడా చెరిగిపోవడం ఖాయంలా అనిపిస్తుంది. మరి చూడాలి. ఎందుకంటే రామాయణం కథ అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికి తెలిసిందే. అలాంటి రామాయణంని త్రీడి టెక్నాలజీలో చూస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఊహించాల్సిన పనిలేదు.మన బాహుబలి ప్రభాస్ ఆదిపురుష్ గా ఇంకెన్ని వండర్స్ సృష్టిస్తాడో..ఈ మూవీ వచ్చే సంవత్సరం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నారు. రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. సీతగా కృతిసనన్ నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: