ట్రోల్స్ కి సమాధానం చెప్పాలంటే విష్ణు హిట్ కొట్టాల్సిందే!!

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో యూట్యూబ్ లో హీరోల పై ట్రోల్స్ ఎంతగా వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదైనా సందర్భంలో సెలబ్రిటీలు మాట్లాడిన దానిని తీసుకొని వ్యంగంగా చేసి యూట్యూబ్లో వదిలి వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా హీరో మంచు విష్ణు పై జరుగుతున్న దాడి చాలా సీరియస్ అయిన విషయం తెలిసిందే. సైబర్ క్రైమ్ ను ఆశ్రయించి మంచి విష్ణు ఈ ట్రోల్స్ ని ఎదుర్కోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎలాంటి ట్రోల్స్ ఆయన పై రాకుండా ఉండాలి అంటే ఒక హిట్టు కొడితే బాగుంటుంది అనేది కొంతమంది విష్ణు అభిమానుల ఆలోచన.

మా ప్రెసిడెంట్ గా ఎన్నికైన తరువాత ఆయన విడుదల చేస్తున్న తొలి సినిమా కావడంతో మంచు విష్ణు ఈ జిన్నా సినిమాతో విజయాన్ని సాధిస్తే తప్పకుండా మంచి పేరు సంపాదించుకోవడం ఖాయం అని చెప్పాలి. ఆయన చాలా సభలలో మాట్లాడిన విధానాన్ని తప్పుపరుస్తూ కొంతమంది యూట్యూబర్స్ చేస్తూ ఆయన వీడియోలను యూట్యూబ్లో పెట్టారు అయితే అవి ప్రేక్షకులను నవ్వించే విధంగా ఉండడంతో వాటికి కోట్ల కొద్ది వ్యూస్ రావడం జరిగింది. 

మరి ఇలాంటి ట్రోల్స్ జరగకుండా ఆపాలంటే తప్పకుండా జిన్నా సినిమాతో విజయాన్ని అందుకోవాల్సిందే. ఇకపోతే ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని మంచు విష్ణుకు తెచ్చి పెడుతుందో చూడాలి. ఈ సినిమాతో పాటే దీపావళి కి పలు సినిమాలు కూడా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆ చిత్రాలు ఈ సినిమా యొక్క విజయం పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: