సమంత యశోద టీజర్‌ విడుదలకు సిద్దం..!!

murali krishna
సస్పెన్స్, థ్రిల్లర్‌ నేఫథ్యంలో తెరకెక్కుతున్న యశోద చిత్రంలో ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పాన్‌ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ చిత్ర రిలీజ్‌ అప్‌డేట్‌ పై టీం ఒక పోస్టర్‌ ద్వారా హింట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం యశోద హరి-హరీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి . యాక్షన్‌ థ్రిల్లర్‌ నేఫథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.  పోస్టర్‌ లో చూపించిన క్యాలెండర్‌ లో 17వ తేదీని రౌండప్‌ చేసి ఉంచారు మేకర్స్‌. దీని ప్రకారం విడుదల తేదీపై రేపు క్లారిటీ ఇవ్వనున్నట్టు  మనకు అర్థమవుతుంది. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌ తో సినిమా పై  మంచి అంచనాలు మరింత  ఎక్కువగా పెరిగాయి. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌, రావు రమేశ్‌ కీ రోల్స్‌ పోషిస్తున్నారు అంట మరీ . మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు ఈ చిత్రానికి
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వస్తున్నఈ సినిమాని శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ జానర్‌లో నేషనల్ లెవల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రం యశోద అని అంటున్నారు దర్శకుడు . సమంత మరోవైపు గుణశేఖర్‌ దర్శకత్వంలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న శాకుంతలం ఇప్పటికే షూటింగ్‌  అంతా పూర్తి చేసుకుంది. మరి, ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ మరో లీడ్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీపై  ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అని అంటున్నారు . దీంతోపాటు విజయ్‌ దేవరకొండ-శివనిర్వాణ కాంబోలో వస్తున్న ఖుషి సినిమాలో కూడా నటిస్తోంది సామ్‌. ఖుషి ప్రస్తుతం షూటింగ్‌ దశలో నే ఉంది, మొత్తానికి సమంత మాత్రం బారి ఆఫర్సస్ తో ముందుకు పోతుందని అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: