4K క్యాలిటీతో రాబోతున్న 'బిల్లా' రీరిలీజ్!

murali krishna
టలీవుడ్ లో నయా ట్రెండ్ కొనసాగుతోంది. పలువురు హీరోల బర్త్ డే సందర్భంగా వారి బ్లాక్ బస్టర్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా 'పోకిరి' సినిమాను 4K క్వాలిటీలో రీరిలీజ్ చేశారు.
ఈ సినిమాకు అభిమానుల నుంచి అద్భుత స్పందన లభించింది. ఆ తర్వాత మెస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా 'ఘరానా మొఘుడు' సినిమాను సైతం రీరిలీజ్ చేశారు. చిరంజీవి అభిమానులు ఈ సినిమాకు క్యూ కట్టారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా 'తమ్ముడు', 'జల్సా' సినిమాలను ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా అద్భుత స్పందన వచ్చింది. అభిమానులు థియేటర్లలో చేసిన హంగామా మామూలుగా లేదు.
ఈ లిస్టులో ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేరబోతున్నాడు. ఈ నెల 23(అక్టోబర్ 23న) ఆయన బర్త్ డే కావడంతో అభిమానులు సరికొత్తగా వేడుకలు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగానే ప్రభాస్ సూపర్ హిట్ మూవీ 'బిల్లా'ను రీరిలీజ్ చేయబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 4K క్వాలిటీలో విడుదల చేసేందు సిద్ధం అవుతున్నారు. 'బిల్లా' హిందీలో సూపర్ హిట్ సాధించిన 'డాన్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ముగ్గురు హీరోయిన్లు ఇందులో నటించారు. అనుష్క మెయిన్ హీరోయిన్ గా చేయగా, నమిత, హన్సిక కీలక పాత్రలు పోషించారు. అప్పట్లో బ్రహ్మాండమైన ప్రజాదరణ దక్కించుకున్న ఈ సినిమా 4K క్వాలిటీ రీరిలీజ్ ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే!
ప్రస్తుతం ప్రభాస్ పలు పాన్ ఇండియన్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలు కూడా చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో హార్రర్ కామెడీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తున్నది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో తెరకెక్కుతున్నది. అటు కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కే' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సగానికిపైగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌ గా ఈ సినిమా రూపొందుతోంది.
తాజాగా ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియన్ మూవీ 'ఆది పురుష్' టీజర్ తాజాగా విడుదల అయ్యింది. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతాదేవిగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. 'ఆది పురుష్' సినిమా పూర్తిగా గ్రీన్ మ్యాట్ మీదే చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరెక్కుతున్నది. అయితే. ఇటీవల విడుదలైన టీజర్ లో రావణుడి పాత్రపై పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. పలువురు ఈ సినిమాపై కోర్టుల్లో కేసులు వేశారు. ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: