అక్కినేని అభిమానులను అఖిల్ ఆదుకునేనా..?

Divya
అక్కినేని అభిమానులు కాస్త ఈ మధ్యకాలంలో అయోమయానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి అక్కినేని అభిమానులకు తీవ్రమైన నిరాశ ఎదురవుతూనే ఉంది. నాగచైతన్య నటించిన థాంక్యూ చిత్రం , బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య లాల్ సింగ్ చద్ద చిత్రం,నాగార్జున నటించిన ది ఘోస్ట్ చిత్రం భారీ డిజాస్టర్ గా మిగిలాయి. ఇక అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమా పైన కూడా అంతగా ఖుషి లేనట్లుగా కనిపిస్తోంది. ఇక చివరిగా అక్కినేని అభిమానులకు బంగార్రాజు సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు ఇక ఆ తర్వాత నటించిన అక్కినేని సినిమాలన్నీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

అయితే చైతన్య ఈ సినిమాలన్నీ లైట్ గా తీసుకున్న నాగార్జున మాత్రం ది ఘోస్ట్ సినిమాపై చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రం నిరాశని మిగిల్చింది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న దసరా బరిలో ఈ సినిమా విడుదల చేయగా మొదటి నుంచి ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది మూటకట్టుకుంది ఈ చిత్రం. ఇక అఖిల్ నటిస్తున్న స్పై యాక్షన్ త్రిల్లర్ చిత్రం ఏజెంట్ సినిమాని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది.

ఈ సినిమా కూడా అఖిల్ కెరీర్ లోనే అత్యంత బారి బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని అఖిల్ కూడ  చలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా విడుదల సమయం మాత్రం అక్కినేని అభిమానులకు చాలా సమస్యగా మారింది ముందుగా ఈ చిత్రాన్ని గత సంవత్సరం డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన కరోనా కారణంగా ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు కానీ అది కూడా జరగలేదు. ఇక చివరికి ఏడాది డిసెంబర్ కూడా రావడం జరుగుతుంది అయినా కూడా ఈ సినిమా డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: