ప్రభాస్ "సలార్" మూవీ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస మూవీ లలో నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . అందులో భాగంగా ప్రస్తుతం ప్రభాస్ "కే జి ఎఫ్" మూవీ తో దేశ వ్యాప్తంగా దర్శకుడి గా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , మలయాళ స్టార్ నటులలో ఒకరు అయిన పృథ్వి రాజ్ సుకుమారన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ కి రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. సలార్ మూవీ కొత్త షెడ్యూల్ తాజాగా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఈ తాజా షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు శృతి హాసన్ కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. 20 నిమిషాల భారీ యాక్షన్ సన్నివేశాలను ప్రస్తుతం మూవీ యూనిట్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ యాక్షన్ సన్నివేశం సముద్రం లో బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ 20 నిమిషాల యాక్షన్ సన్నివేశాల కోసం దాదాపు 10 కోట్ల రూపాయలను  మూవీ యూనిట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న ప్రభాస్ ,  ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కావడంతో సలార్ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీ లోని యాక్షన్ సన్నివేశాలను అద్భుతమైన రీతిలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: