మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' మూవీ టీజర్ హైలైట్స్ ఇవే

murali krishna
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్నాడు..ఈ సినిమా తర్వాత ఆయన చేస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'..పవర్ , సర్దార్ గబ్బర్ సింగ్ మరియు జై లవ కుశ వంటి సినిమాలు తీసిన బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శృతి హాసన్ హీరోయిన్ గా, మరియు మాస్ మహారాజ రవితేజ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు..భారీ బడ్జెట్ తో క్వాలిటీ పరంగా ఎక్కడా కూడా తగ్గకుండా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు..ఇక పుష్ప సినిమా మ్యూజిక్ తో దేశాన్ని ఒక ఊపు ఊపిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు..వచ్చే సంక్రాంతి కానుకగా ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కి సంబంధించి డబ్బింగ్ వర్క్ ని ఈరోజే ప్రారంభించారు..ప్రస్తుతం హైదరాబాద్ లో చిరంజీవి పై భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు..ఇక ఈ దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు మూవీ టీం..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చెయ్యబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ని అభిమానులు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో..అలా చూపించబోతున్నాడట డైరెక్టర్ బాబీ ఈ సినిమా ద్వారా..చిరంజీవి మన అందరం నచ్చేది ఆయనలోని మాస్, ఫైట్స్, కామెడీ టైమింగ్ మరియు డ్యాన్స్..ఇవన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయట..దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం 5 మాస్ డాన్స్ నంబర్స్ ని కంపోజ్ చేసాడట..అభిమానులకు ఇది కనుల పండుగలాగా ఉంటుందట..రీ ఎంట్రీ లో ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత చిరంజీవి తన మార్కు కమర్షియల్ సినిమాలు చెయ్యలేదని చెప్పాలి..సైరా నరసింహ రెడ్డి, ఆచార్య మరియు గాడ్ ఫాదర్ ఈ మూడు చిత్రాలు కూడా నాన్ కమర్షియల్ సినిమాలు అవ్వడం తో అభిమానులు చిరంజీవి నుండి తన మార్కు ఎంటర్టైనర్ ని కోరుకుంటున్నారు.
ఈ సినిమా సరిగ్గా వారి అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుందట..ఆ విషయం ఈ దీపావళి కి విడుదల చెయ్యబొయ్యే టీజర్ తోనే అర్థం అయిపోతుంది అంటున్నారు మూవీ టీం,,అదిరిపొయ్యే యాక్షన్ కట్స్ మరియు మాస్ డైలాగ్ తో ఈ టీజర్ ని మలిచాడట డైరెక్టర్ బాబీ..రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కి ది బెస్ట్ టీజర్ కట్ గా నిలుస్తుందని చెప్తున్నారు..విడుదలకి ముందే ఇంత పాజిటివ్ అంచనాలను పెంచిన ఈ టీజర్ కట్..విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: