చప్పగా దీపావళి సీజన్.. పెద్ద సినిమాలెక్కడ?

P.Nishanth Kumar
పండుగ సీజన్ అనగానే సినీ ప్రేమికులు ఎంతగా సినిమాల కోసం ఎదురు చూస్తారో అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ విధంగా మొన్నటి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రెండు భారీ చిత్రాలు వచ్చి వారిని ఎంతగానో అలరించాయి. ఈ నేపథ్యంలోనే దీపావళి సీజన్ ప్రేక్షకులను ఆలచించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో దీపావళి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోయే సినిమాలు ఏవి వారిని అలరిస్తాయో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.

ఈ నేపథ్యంలోనే ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలు కాకపోవడంతో ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ చప్పగా ఉందని కొంతమంది సినిమా అభిమానులు భావిస్తున్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న జిన్నా సినిమా దీపావళికి సందర్భంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఫామ్ లో లేని మంచి విష్ణు సినిమాను ప్రేక్షకులు ఏ మాత్రం ఆదరిస్తారో చూడాలి. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.  

ఇక దీపావళికి అలరించే సినిమాలలో ఒకే ఒక క్రేజీ సినిమా ప్రిన్స్ అనే చెప్పాలి. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కు జాతి రత్నాలు ఫేమ్ అను దీప్ దర్శకత్వం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ రెండు భాషలలోనూ ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బాగుంటే కనుక మంచి కలెక్షన్లను సాధించడం ఖాయం అని చెప్పాలి. ఇక విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా సినిమా కూడా దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం పై కూడా పెద్దగా బజ్ క్రియేట్ అవలేదు. ఇక కార్తి హీరోగా నటించిన సర్దార్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు దీపావళి సందర్భంగా రాబోతుంది. ఈ సినిమా అయినా దీపావళిని మరింత మనోరంజకంగా మారుస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: