"గాడ్ ఫాదర్" మూవీ కి దర్శకుడిగా మొదటి ఆప్షన్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించాడు  గాడ్ ఫాదర్ మూవీ మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ మూవీ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కింది. గాడ్ ఫాదర్ మూవీ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించగా ,  సత్య దేవ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయనcతార ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది.

ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.  ఈ మూవీ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల అయ్యింది. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించడం వల్ల ఈ మూవీ పై బాలీవుడ్ సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన గాడ్ ఫాదర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకొని ప్రస్తుతం అద్భుత మైన కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర రాబడుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. తాజా ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చిరంజీవి "గాడ్ ఫాదర్" మూవీ గురించి మాట్లాడుతూ ... గాడ్ ఫాదర్ మూవీ కి దర్శకత్వం వహించే వారిలో మొదటి ఆప్షన్స్ కుమార్ అని , కాకపోతే సుకుమార్ ఇతర కమిట్మెంట్ లతో అందుబాటులో లేడు. దానితో కొంత మంది దర్శకులను సంప్రదించాము. కానీ మూవీ లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో వారు కూడా ఆందోళన చెందారు. చివరకు మోహన్ రాజా రంగంలోకి దిగాడు. అని మెగాస్టార్ చిరంజీవి తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: