8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా "గాడ్ ఫాదర్" మూవీ సాధించిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా , సత్య దేవ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. చిరంజీవి ఈ మూవీ లో హీరోగా నటించడం ,  సల్మాన్ ఖాన్ ,  సత్య దేవ్ ,  నాయన తార వంటి నటీనటులు ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించడం ,  టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో ,  ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు. పెట్టుకున్నారు అలా మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల అయిన గాడ్ ఫాదర్ మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతుంది. గాడ్ ఫాదర్  మూవీ ఇప్పటి వరకు 8 రోజుల బాక్స్ ఆఫీసర్ రన్ ని కంప్లీట్ చేసుకుని. ఈ 8 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


నైజాం : 11.73 కోట్లు .
సీడెడ్ : 9.05 కోట్లు .
యు ఏ : 5.41 కోట్లు .
ఈస్ట్ : 3.48 కోట్లు .
వెస్ట్ : 2.10 కోట్లు .
గుంటూర్ : 3.75 కోట్లు .
కృష్ణ : 2.50 కోట్లు .
నెల్లూర్ : 1.90 కోట్లు .
8 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో గాడ్ ఫాదర్ మూవీ  39.92 కోట్ల షేర్ , 65.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటకలో : 4.54 కోట్లు .
హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో  : 4.64 కోట్లు .
ఓవర్ సీస్ లో : 4.81 కోట్లు .
8 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా గాడ్ ఫాదర్ మూవీ 53.92 కోట్ల షేర్ ,  97.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: