ప్రభాస్ పుట్టినరోజు నాడు ఆ మూడు మూవీల నుండి అప్డేట్లు..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం ప్రభాస్ వరుస మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ మూవీ షూటింగ్ ను ముగించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే అక్టోబర్ 23 వ తేదీన రెబల్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల నుండి కొన్ని అప్డేట్ లను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ప్రభాస్ ,  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ నుండి ఒక అప్డేట్ ను విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ నుండి కూడా చిత్ర బృందం ఒక అప్డేట్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆది పురుష్ మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే మూవీ యూనిట్ టీజర్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నుండి మరో అప్డేట్ ను కూడా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆది పురుష్ ,  సలార్ , ప్రాజెక్ట్ కే మూవీ ల నుండి అప్డేట్ లు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: