"ఓటిటి" ప్లాట్ ఫామ్ లో అదరగొడుతున్న "అల్లూరి" మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉన్న నటులలో ఒకరు అయిన శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . చిన్న చిన్న పాత్రలలో నటించి తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న శ్రీ విష్ణు ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తూ తన కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరోగా నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న శ్రీ విష్ణు తాజాగా అల్లూరి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.
 

ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులను అలరించిన అల్లూరి మూవీ కొన్ని రోజుల నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతుంది.  ఈ మూవీ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 35 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించినట్లు ఆహా "ఓ టి టి" సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఇలా అల్లూరి మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అదరగొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: