అక్కడైనా బేబమ్మ సక్సెస్ పొందేనా..?

Divya
కన్నడ అందం తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఉప్పెన సినిమాతో అడుగుపెట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది . ఇక ఈ సినిమా ఇచ్చిన విజయాన్ని ఉపయోగించుకొని ఆ తర్వాత వచ్చిన నాని శ్యామ్ సింగరాయ్, నాగచైతన్య బంగార్రాజు సినిమాలలో అవకాశాలను దక్కించుకొని హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఎంత తొందరగా ప్రేక్షకులకు రీచ్ అయ్యిందో అంతే తొందరగా అవకాశాలను అందుకుంటూ కథల ఎంపిక విషయంలో తడబాటు చెందింది అని చెప్పవచ్చు . ఎందుకంటే ఆ తర్వాత ఈమె ఎంచుకున్న కథల వల్ల ఈమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. అలా వచ్చిన రామ్ దివారియర్, నితిన్ మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాల ద్వారా పూర్తిగా వరుస హ్యాట్రిక్ ఫ్లాప్ లను చవిచూసింది.

ఇప్పుడు ఇక ఈమె కెరియర్ డౌన్ అయినట్టే  అంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరొకవైపు నాగచైతన్యతో మరొకసారి తమిళ్ డైరెక్టర్ వెంకట ప్రభు డైరెక్షన్లో ఒక సినిమాలో చేయబోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాతో నైనా ఆమె విజయం సాధిస్తే లక్కీ హ్యాండ్ అవుతుందని లేకపోతే ఐరన్ లెగ్ గానే ముద్ర పడిపోతుందనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.  ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మకు మాలీవుడ్ నుండి అవకాశాలు వచ్చినట్లు సమాచారం. అక్కడ ఒక క్రేజీ ఆఫర్ ను పట్టేసింది కృతి శెట్టి. భారీ పిరియాడిక్ యాక్షన్ మూవీలో అవకాశం వచ్చిందట. ఇక ఈ మూవీ తోనే ఆమె మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం..
తాజాగా ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.  ఇంస్టాగ్రామ్ వేదికగా కొత్త చిత్ర విశేషాలు కూడా తెలియజేశారు. మిన్నల్ మురళి ఫేమ్ తోవినో థామస్ హీరోగా అజయంతే రాన్ దామ్ మోషణం  అనే టైటిల్ తో పిరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని తెరకెక్కిస్తున్నారు . జితిన్ లాల్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది కృతి శెట్టి . ఇకపోతే ఈ సినిమాతో నైనా ఆమె విజయం సాధించాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: