జిన్నా సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఒకవైపు బాధ్యతలు చేయబడుతూనే మరొకవైపు సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు. తాజాగా మంచు విష్ణు నటించిన చిత్రం జిన్నా. ఈ చిత్రం యాక్షన్ ,థ్రిల్లర్, కామెడీ కథ అంశంతో తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో సన్నిలియోన్, పాయల్ రాజ్పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని మంచు మోహన్ బాబు దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో సన్నిలియోన్ మొదటిసారిగా ఒక పల్లెటూరు అమ్మాయిగా కనిపించబోతోంది మంచు విష్ణు కూడా ఇందులో ఒక సౌండ్ సిస్టమ్ ఆపరేటర్ గా కనిపించబోతున్నారు.
ఇక ఈ చిత్రం అక్టోబర్ 21 వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్లను చాలా వేగవంతం చేస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ ను సన్నీలియోన్ తో చిత్రీకరించినట్లుగా సమాచారం. అందుకు సంబంధించి ఈ రోజున ఒక అప్డేట్ ని కూడా విడుదల చేశారు. సన్నీలియోన్ మంచు విష్ణు మధ్య వచ్చే జూరు మిఠాయి అనే సాంగ్ లిరికల్ వీడియోని విడుదల చేశారు. ఈ పాటలో కూడా సన్నిలియోన్ తన గ్లామర్ తో ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.

మంచు విష్ణు కూడా సన్నిలియోన్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసినట్లుగా ఈ లిరికల్ వీడియోలో చూస్తే మనకి అర్థమవుతుంది. గత కొద్దిరోజులుగా మంచు ఫ్యామిలీ ఎక్కువగా ప్లాపులను చవిచూస్తోంది. మరి ఈ సినిమాతో ఎవరైనా మంచు విష్ణు సక్సెస్ అవుతారని ఆయన అభిమానులు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ లిరికల్ వీడియో మాత్రం చాలా వైరల్ గా మారుతోంది. మరి చిత్రంతోనైనా సన్నీలియోన్,  పాయల్ , మంచు విష్ణు కెరియర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: