దసరా మూవీ "ధూమ్ దామ్ దోస్తాన్" సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. పూర్ణ ఈ మూవీ లో ప్రతి నాయక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సగనునట్లు సమాచారం. ఈ మూవీ లో నాని ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి మూవీ యూనిట్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అందులో నాని అదిరిపోయే ఊర మాస్ లుక్ లో కనిపించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం "ధూమ్ దామ్ దోస్తాన్" అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సాంగ్ లో కూడా నాని అదిరిపోయే ఊర మాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. అలాగే ఈ సాంగ్ కూడా ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తోంది. ఇప్పటి వరకు ఈ సాంగ్ కి యూట్యూబ్ లో 5.6 మిలియన్ వ్యూస్ ని , 132 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈ మూవీ నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: