పాన్ ఇండియా మూవీ కల్చర్ పై తేజా సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja
ఘన విజయాలతో మొదలుపెట్టి అపజయాల బాట పట్టిన దర్శకుల లిస్టులో తేజా ముందు వరసలో ఉంటాడు. ప్రస్తుత తరం దర్శకులలో బాగా సీనియర్ అయిన తేజా ఎందరో నూతన నటీనటులకు అవకాశాలు ఇవ్వడమే కాకుండా అతడి ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన వారి సంఖ్య 1163 అంటే ఎవరైనా ఆశ్చర్యపోయే విషయం.
 
దగ్గుబాటి సురేష్ బాబు రెండవ కొడుకు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజా తీసిన ‘అహింస’ మూవీ దీపావళికి విడుదల కానున్నది. ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాన్ ఇండియా సినిమాల పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం చాలామంది దర్శకులు తమ తెలుగు సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా తీయాలని ప్రయత్నిస్తూ ఉండటంతో కొంత కన్ఫ్యూజన్ కొనసాగుతోందని కామెంట్స్ చేసాడు.
 
 తెలుగు ప్రేక్షకుల కోసం సినిమాలు తీస్తూ ఆసినిమాను హిందీలో కూడ రిలీజ్ చేసినంత మాత్రాన అది పాన్ ఇండియా మూవీ అవుతుందా అంటూ తేజా ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు ఎంత సమర్ధుడు అయినప్పటికీ ఒక బాణంతో 5 లక్ష్యాలను గురి చూసి కొట్టగలరా అంటూ తేజా ప్రశ్నిస్తున్నాడు. ఇక అభిరామ్ గురించి మాట్లాడుతూ తాను ఎంత గొప్ప కుటుంబం నుంచి వచ్చిన నటుడు పైన కనికరం చూపెట్టననీ తనకు రావలసిన అవుట్ పుట్ కోసం అభిరామ్ కు కూడ ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు అన్న విషయాన్ని తేజా బయటపెట్టాడు.
 
 
తన దృష్టిలో జీవితం అంటే ఎవరికైనా ఒకలాగే కొనసాగితే చాల బోరింగ్ గా ఉంటుందని జయాప జయాలు కష్టాలు సుఖాలు అన్నీ కలిసి ఉన్నప్పుడే జీవితం పట్ల కసి పెరుగుతుందని అభిప్రాయ పడుతున్నాడు. హోమ్ ధియేటర్ లో సినిమా చూసేకంటే ధియేటర్ కు వెళ్ళి సినిమా చూసినప్పుడు తనకు ఆనందం ఎక్కువ కలుగుతుందని అంటూ ప్రేక్షకులు ఎప్పుడు స్టార్స్ కోసం ఎదురు చూడరు మంచి సినిమాల కోసం ఎదురు చూస్తారు అని అంటున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: