వర్షా పెళ్లి అతడి తోనే అంట..!

murali krishna
:జబర్దస్త్ లో ఎప్పుడూ ఏదో ఒక జంటని హైలెట్ చేస్తూ టీ.ఆర్.పిని పెంచే ప్రయత్నం చేస్తుంటారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఇలాంటి గిమ్మిక్కులు కూడా చేస్తుంటారు.
ఇక్కడ ఎన్నో జంటలను ఏర్పాటు చేశారు. అందులో మొదటిగా చెప్పుకునే జంట సుధీర్ అండ్ రష్మి.. వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అన్నది వారిద్దరికి కూడా తెలియదని మనం చెప్పొచ్చు. కానీ జబర్దస్త్ షోలో మాత్రం ఇద్దరు లవర్స్ గా ట్రీట్ చేస్తుంటారు. షో కోసమో.. టీ.ఆర్.పి కోసమో వీళ్లు కూడా దానికి ఓకే చెప్పారు, అనుకుంట
ఇక ఇప్పుడు జబర్దస్త్  లో మరో క్రేజీ జోడీ తయారైంది. అదే ఇమ్మాన్యుయల్ అండ్ వర్ష. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ గా వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ బాగానే ఉంది. అయితే దాన్ని ప్రేమగా జబర్దస్త్ వాళ్లు చూపిస్తున్నారు. వర్ష, ఇమ్మాన్యుయల్ కూడా వాళ్లు లవ్ లో ఉన్నామన్న ఆలోచనలోనే ఉన్నారు. కొన్ని స్కిట్స్ లో చేస్తే.. కొన్ని బయట కూడా వీళ్లు ఇంతే అన్నట్టు చెబుతున్నారు. లేటెస్ట్ గా ఎట్టకేలకు వర్షంతో ఇమ్మాన్యుయల్ పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే దానికి ఒక కండీషన్ పెడుతుంది వర్ష. అదేంటి అంటే తన పెళ్లికి టాలీవుడ్ స్టార్స్ అంతా రావాలని అంటుంది, అంట వర్ష
 
దీనితో రెచ్చిపోయిన ఇమ్మాన్యుయల్.. చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్ వీళ్లందరికి తెస్తా అంటాడు. షోకి కాదు కాదు వీళ్ల పెళ్లికి వాళ్లని తెచ్చాడు కూడా.. అయితే ఇక్కడ మెగాస్టార్ బదులుగా డూప్ చిరంజీవి.. డూప్ పవన్ కళ్యాణ్ వచ్చారు. షో రేటింగ్ పెంచడానికి ఇమ్మాన్యుయల్, వర్షల పెళ్లికి వారిని ఆహ్వానించారు. అయితే ఇది చూసిన మెగా, పవర్ స్టార్ మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్ ఇది మరీ టూ మచ్ అని అనేస్తున్నారు. టూ మచ్ అయినా అంతా కామెడీ కోసమే కాబట్టి ఇమ్ము, వర్షల ఎంటర్టైన్ మెంట్ అందరు మెచ్చుకుంటున్నారు. ఈమధ్య జబర్దస్త్ నుంచి చాలమంది కమెడియన్స్ బయటకు రాగా షో నిలబెట్టే ప్రయత్నంలో నానా తిప్పలు పడుతున్నారు జబర్దస్త్ కమెడియన్స్,..

  జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ వర్ష పెళ్లి కోసం చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ దాకా.. బాబోయ్ వీళ్ళ వేషాలు మాములుగా లేవు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: