ఆ మూవీలో డేంజర్ డాన్ పాత్రలో కనిపించబోతున్న దళపతి విజయ్..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దళపతి విజయ్ ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి మార్కెట్ ను సృష్టించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దళపతి విజయ్ టాలీవుడ్ దర్శకుడు అయినటువంటి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీ ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ తమిళ్ మరియు తెలుగు భాషలలో విడుదల కాబోతుంది. తమిళ్ లో ఈ మూవీ వరసు పేరుతో విడుదల కానుండగా , తెలుగు లో వారసుడు పేరుతో విడుదల కాబోతుంది. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత దళపతి విజయ్ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో దళపతి విజయ్ డేంజర్ డాన్ పాత్రలో కనిపించబోతున్నట్లు , ఈ పాత్ర అదిరిపోయే రేంజ్ హైలైట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఒక అదిరిపోయే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే దళపతి విజయ్  లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్టర్ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. దానితో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే తదుపరి మూవీ పై అద్భుతమైన అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: