వర్ష - ఇమాన్యుయేల్ పెళ్లి.. గెస్టులుగా చిరు, పవన్?

praveen
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ లాంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ కొన్ని జంటలు హాట్ టాపిక్ గా  మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక కొన్ని జోడీలకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఈటీవీ వారు ఎలాంటి ఈవెంట్ నిర్వహించిన కూడా ఆ జోడీలు ఎప్పుడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక ఇలా బాగా పాపులారిటీ సంపాదించిన జోడీలలో ఇమాన్యుయల్ వర్షా జోడి కూడా ఒకటి. ఎన్నో ఎపిసోడ్లు, ఎన్నోసార్లు స్పెషల్ ఫోకస్, వీరిద్దరి రొమాంటిక్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులందరిని వీరిపై దృష్టి పడేలా చేసింది. ఇక ఎప్పుడూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వీరిద్దరూ జబర్దస్త్ స్టేజ్ పై వ్యక్తపరచుకుంటూ ఉంటారు.

 త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి. గతంలో ఇమాన్యుయల్ లేకుండా లైఫ్ ఊహించుకోలేను అంటూ వర్షా చెప్పేది. వీరిద్దరూ కలిసి పలుమార్లు మ్యారేజ్ స్కిట్లు కూడా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ జోడి పెళ్లికి సిద్ధమయ్యారు అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే తమ పెళ్లి జరగాలంటే ఇమ్మానుయేల్ కు ఒక కండిషన్ పెట్టింది వర్ష. నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలి అంటూ తెలిపింది.

 దీంతో వెంటనే రెచ్చిపోయిన ఇమాన్యుయల్.. తనకు చిరంజీవి నాగార్జున పవన్ కళ్యాణ్ వీళ్లంతా తెలుసు అంటాడు. అలా అయితే వారిని పెళ్లికి తీసుకురమ్మని చెబుతుంది వర్ష   దీంతో వర్ష కోరికను కాదన లేకపోయినా ఇమ్మానుయేల్ సెలబ్రిటీలను రంగంలోకి దించుతాడు. ఈ క్రమంలోనే చిరంజీవి నాగార్జున పవన్ కళ్యాణ్ లకు డూపులను తీసుకువచ్చి డాన్సులతో అదరగొట్టారు. ఇక ఇలా వర్ష చేసిన స్కిట్ ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయించింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: