మహేష్ బాబు ఆ మూవీకి థియేటర్ లలో దక్కాల్సిన ఆదరణ దక్కలేదు... సూర్యదేవర నాగవంశీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సూర్యదేవర నాగ వంశీ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సూర్యదేవర నాగ వంశీ ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనేక మూవీ లను నిర్మించాడు . అందులో భాగంగా ఇప్పటికే ఈ నిర్మాత నిర్మించిన ఎన్నో మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించి సూర్యదేవర నాగ వంశీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిర్మాత గా మంచి గుర్తింపు ను తీసుకు వచ్చాయి . 

ఇది ఇలా ఉంటే తాజాగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ,  బెల్లంకొండ గణేష్ హీరోగా ,  వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా స్వాతి ముత్యం అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ న అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా సూర్యదేవర నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా సూర్యదేవర నాగవంశీ ,  మహేష్ బాబు 'అతడు' మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పు కొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ...  మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన అతడు మూవీ కి థియేటర్ లలో దక్కాల్సిన ఆదరణ దక్కలేదు అని వ్యాఖ్యలు చేశాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్యదేవర నాగ వంశీ ,  మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: