ఏంటి.. బింబిసార దర్శకుడు.. ఆ సినిమాలో హీరోగా చేశాడా?
అతని టేకింగ్ అద్భుతంగా ఉంది అంటూ ఎంతో మంది ప్రశంసలు కురిపించారు అని చెప్పాలి. అయితే ఇలా బింబిసారా అలాంటి సోషియో ఫాంటసీ మూవీ ని తెరకెక్కించి మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ కొట్టిన దర్శకుడు వశిష్ట్ కూడా హీరోగా సినిమాల్లో నటించాడు అన్న విషయం మాత్రం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పాలి. మల్లిడి వశిష్ట్ దర్శకుడు మాత్రమే కాదు నటుడు కూడానట.. అయితే ఇతని అసలు పేరు వేణు. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ తనయుడు. సాధారణంగా హీరోలు దర్శకులుగా మారడం ఎప్పుడు కామన్ గా జరుగుతూ ఉంటుంది.
వశిష్ట్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగిందట.. ఒకే ఒక సినిమాలో హీరోగా నటించిన తర్వాత దర్శకుడిగా అవతారం ఎత్తాడు వశిష్ట్. హీరోగా దర్శకుడిగా చేసిన సినిమాకు మధ్య పదహారేళ్ల గ్యాప్ ఉండడం గమనార్హం. 2006లో కులశేఖర్ దర్శకత్వం వహించిన ప్రేమ లేఖ రాశా అనే సినిమాలో హీరోగా నటించాడు. కులశేఖర్ లాంటి రచయిత దర్శకుడిగా ఒక సినిమాను చేశారంటే ఆ సినిమాపై అంచనాలు ఉండడం సహజం. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత మాత్రం పెద్దగా ప్రేక్షకులు ఆదరణ పొందలేదు. తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న వశిష్ఠ దర్శకుడిగా మారి బింబిసారా సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టేసాడు.