హైదరాబాద్ లో 'విక్రమ్ వేద' టికెట్ ధరలు ఇవే..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుత మైన క్రేజ్ ఉన్న నటులు అయినటు వంటి హృతిక్ రోషన్ , సైఫ్ అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కూడా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను దక్కించు కున్నారు. అదిరిపోయే క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ప్రస్తుతం విక్రమ్ వేద అనే మూవీ లో కలిసిన విషయం మన అందరికీ తెలిసిందే.

హిందీ విక్రమ్ వేద తమిళం లో తెరకెక్కి అద్భుతమైన విజయం సాధించిన విక్రమ్ వేద అనే తమిళ మూవీ కి అఫీషియల్ హిందీ రీమేక్ గా తెరకెక్కింది. హిందీ విక్రమ్ వేద మూవీ కి పుష్కర్ - గాయత్రి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ని సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై బాలీవుడ్ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విక్రమ్ వేద మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై సర్వత్ర సినీ ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ హైదరాబాద్ సిటీ లో కూడా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ మూవీ టికెట్ ధరలు హైదరాబాద్ సిటీలో ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో తెలుసుకుందాం. విక్రమ్ వేద మూవీ టికెట్ ధరలు హైదరాబాద్ సిటీలో మల్టీప్లెక్స్ థియేటర్ లలో 200 రూపాయలు గాను  ,  సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో 150 రూపాయలు గాను ఉండబోతున్నట్లు తెలుస్తోం.ది ఇది ఇలా ఉంటే ఇప్పటికే తమిళం లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విక్రమ్ వేద సినిమా హిందీ రీమేక్ అయినటువంటి విక్రమ్ వేద ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: