'బ్రహ్మాస్త్ర- 2'లో మరో టాలీవుడ్ స్టార్ హీరో..?

Anilkumar
ఇటీవల విడుదలై వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా హిట్టయింది అన్న సంగతి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ సినిమ మంచి విజయాన్ని అందించింది అనే చెప్పాలి.మంచి విజయం కాకుండా రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా కాసుల వర్షాన్ని కూడా కురిపించింది.తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది.ఇక  ఈ సినిమా వసూళ్లతో కరణ్ జోహార్, స్టార్ స్టుడియోస్ భారీ లాభాలు ఆర్జించాయి.ఇకపోతే బ్రహ్మాస్త్ర హిట్టవ్వడంతో, బ్రహ్మాస్త్ర పార్ట్-2కు లైన్ క్లియర్ అయింది.

అయితే పార్ట్-1 రాసుకున్నప్పుడే పార్ట్-2కు సంబంధించి కథ అనుకున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. కాగాసీక్వెల్ కాబట్టి, పార్ట్-2కు స్క్రీన్ ప్లే రాయడం పెద్ద సమస్య కాదు. ఇకపోతే వీలైనంత త్వరగా పార్ట్-2ను సెట్స్ పైకి తీసుకురావడానికి కరణ్ జోహార్ పావులు కదుపుతున్నాడు.ఇదిలావుంటే ఈసారి బ్రహ్మాస్త్ర-2 ను మరింతమంది స్టార్స్ తో నింపేయాలని భావిస్తున్నాడు కరణ్.ఇక  శివగా రణబీర్ కపూర్ కొనసాగుతాడు.అయితే  ఓ కీలక పాత్ర కోసం హృతిక్ రోషన్ ను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. మరో కీలక పాత్ర కోసం టాలీవుడ్ నుంచి ఓ స్టార్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు.

అయితే దీని కోసం రాజమౌళిని రంగంలోకి దింపాలని కరణ్ భావిస్తున్నాడు.ఇక  రాజమౌళి కోరితే, బ్రహ్మాస్త్రలో నటించడానికి ఎవ్వరైనా ముందుకొస్తారు. కాబట్టి ఇక  బ్రహ్మాస్త్రలో నాగార్జునను తీసుకున్నట్టు, పార్ట్-2 కోసం నాగ్ కంటే పెద్ద స్టార్ ను తీసుకోవాలని యూనిట్ భావిస్తోంది. అది ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది.అయితే బ్రహ్మాస్త్ర పార్ట్-2కు కూడా రాజమౌళి ప్రజెంటర్ గా వ్యవహరిస్తాడు. అంతేకాదు కేవలం సమర్పణ వరకే రాజమౌళిని పరిమితం చేయకుండా, ఈసారి స్క్రీన్ ప్లేలో కూడా అతడ్ని భాగం చేయాలని కరణ్ భావిస్తున్నాడు. అయితే  ఇక ఇది ఏ మేరకు కుదురుతుందనేది కాలమే నిర్ణయిస్తుంది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నాడు జక్కన్న..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: