పెద్ద అందగత్తె కాకపోయినా జీరో సైజు లేకపోయినా ఇండస్ట్రీ ని ఎలుతున్న ఆ నటి....!!

murali krishna
ఇటీవల కాలంలో సినిమాల్లో అవకాశాలు రావాలి అంటే ఎంతో మందికి గగనంలా మారిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం కమెడియన్ల దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు కూడా అందరూ కావాల్సిన దానికంటే ఎక్కువ ముందే ఉన్నారు.
ఈ క్రమంలోనే ఇక ఎవరికి అవకాశం ఇవ్వాలో తెలియక దర్శకులు కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఒకవైపు జీరో సైజ్ మెయింటైన్ చేస్తూ ఇంకోవైపు అందాల ఆరబోత చేస్తేనే నేటి రోజుల్లో అవకాశాలు. ఇక ఇన్ని చేసిన తర్వాత కూడా అవకాశాలు వస్తాయా అంటే అది కూడా పక్కాగా చెప్పలేని పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో ఒక హీరోయిన్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం చేతిలో 8 సినిమాలు ఉన్నాయి అంటే ఆమె ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని సినిమాలు చేస్తుంది అంటే ఆమె అందాల ఆరబోత గట్టిగానే చేస్తూ ఉండొచ్చు. అంతేకాదు గొప్ప అందగత్తె కూడా అయి ఉండొచ్చు. లేదంటే ఇండస్ట్రీకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కుర్ర హీరోయిన్ అయి ఉండవచ్చు అని ప్రతి ఒక్కరిలో ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి ఆలోచనలు చేస్తే మాత్రం పప్పులో కాలేసినట్లే.. మంచి అందం అభినయం ఆమె సొంతం అలా అని గొప్ప అందగత్త ఏమి కాదు.. మంచి నటన ఆమె సొంతం అలా అని నటవిశ్వరూపం ఎందులో చూపించలేదు..
హీరోయిన్ గా ఇప్పుడు వరకు సినిమాల్లో చేసింది. ఇక విలన్ గానూ నటించింది. అంతేకాదు చిన్న చిన్న పాత్రలకు కూడా ఒకే చెబుతుంది. కానీ అందాల ఆడబోత అంటే మాత్రం ఆమడ దూరం ఉంటుంది ఆమె ఎవరో కాదు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి. ఇటీవల కాలంలో లక్కు కోసం పేర్లు మార్చుకుంటున్న రోజుల్లో పాత చింతకాయ లాంటి పేరు ఉన్న అదే పేరుతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోతో సంబంధం లేకుండా పాత్రతో సంబంధం లేకుండా పాత్ర చిన్నదైనా పెద్దదైన చేసుకుంటూ దూసుకుపోతుంది. తద్వారా ప్రస్తుతం ఆమె చేతిలో యశోద, శబరి, పిరంతై పరాశక్తి, లగామ్, హనుమన్, కలర్స్ తో పాటు బాలయ్య తో సినిమా మరికొన్ని సినిమాలు షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: