వాళ్ళు చేసిన అవమానానికి కన్నీళ్లు పెట్టుకొని బయటకు వచ్చిన రోజా.....!!

murali krishna
రోజా.. అప్పట్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. ఇక పెళ్లయిన తర్వాత క్రమక్రమంగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.
ఇక దాంతో రాజకీయాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఎమ్మెల్యేగా ఆ తర్వాత ఇప్పుడు మంత్రిగా వైసీపీ పార్టీలో కొనసాగుతోంది. రోజా వెండితెర మీదనే కాకుండా బుల్లితెర మీద ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్, జబర్దస్త్ షోలలో జడ్జి గా వ్యవహరించి మరింత ఫేమస్ అయ్యింది. అంతే కాకుండా ఈ టీవీ వాళ్ళు నిర్వహించే పలు ఈవెంట్లకు స్పెషల్ గెస్ట్ గా వచ్చేది. ఇక తాజాగా మంత్రి కావడంతో ఈమె అన్ని షోలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
రోజా దసరా పండుగ కానుకగా ఈటీవీ వాళ్ళు చేసే దసరా వైభవం షో కు గెస్టుగా హాజరయ్యారు. ఇక దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఈ షో కి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించింది. ఇక ఈవెంట్లో ఆది రోజా తో మాట్లాడుతూ.. మీరు ఒక హీరోయిన్ మాత్రమే కాకుండా జడ్జి, ఎమ్మెల్యే,మంత్రి అయ్యారు. మీలాగా సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అని అడగగా.. కనిపించే ప్రతి అమ్మాయి చుట్టూ తిరగడం మానేయాలి అంటూ రోజా కౌంటర్ ఇచ్చింది. ఇక ఆది మాట్లాడుతూ ఇక్కడున్న వారికి ఎవరెవరికి ఏ శాఖ సెట్ అవుతుందో రోజా గారు మీరు చెప్పండి అని అడిగితే.. రోజా మాట్లాడుతూ.. శ్రీముఖి అన్ని చానల్లలో టూర్ కొడుతుంది కాబట్టి ఆమెకు టూరిజం శాఖ సెట్ అవుతుంది.
మరి నాకు ఏ శాఖ సెట్ అవుతుందని ఆది అడగగా.. నీకైతే ఆహారభద్రత శాఖ కరెక్ట్ సెట్ అవుతుంది అని రోజా చెప్పింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీ ఆకలి గురించి బాగా వార్తలు వస్తున్నాయి. అందుకే నీకు ఆ శాఖ సెట్ అవుతుందని చెప్పింది. ఇక శాంతి స్వరూప్ నాకు ఏ శాఖ ఇస్తారు మేడం అని అడగగా.. నీకు శాఖ కాదు పాక అంటూ హైపర్ ఆది సెటైర్ వేశారు. ఇక ఆ ఈవెంట్లో నూకరాజు రోజాతో ఏదో చెబుతూ ఉండగా.. రోజా నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అంటూ సీరియస్ అయింది. మీరందరూ ప్లాన్ చేసుకొని మరీ నన్ను పిలిచి అవమానించాలని అనుకుంటున్నారా అంటూ కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఆ ఈవెంట్ నుండి బయటికి వెళ్ళింది. ఇక అలా రోజా ఎందుకు బయటికి వెళ్ళిందో తెలియాలంటే ఈ ఈవెంట్ పూర్తిగా చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: