తల్లి మరణం.. కంటతడి పెట్టిస్తున్న మహేష్ వీడియో?

Purushottham Vinay
ఈ ఏడాది నిజంగా సూపర్‌ స్టార్‌ కృష్ణ గారు ఇంకా సూపర్ స్టార్ మహేష్ గారికి బ్యాడ్ ఇయర్ అని చెప్పాలి. ఎందుకంటే వారి కుటుంబంలో రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. ఏడాది ఆరంభంలో సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కొడుకు రమేష్ బాబు గారు మరణించగా..ఈరోజు ఆయన సతీమణి ఇందిరా దేవి గారు (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆమె ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే బుధవారం సెప్టెంబర్‌ 28న తుదిశ్వాస విడిచారు. ఇందిరా దేవి గారి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది.కృష్ణ- ఇందిరాదేవి గార్లకు రమేశ్‌ బాబు, మహేశ్‌ బాబు.. అమ్మాయిలు పద్మావతి, మంజుల, ప్రియదర్శినితో కలుపుకుని మొత్తం 5 మంది సంతానం. ఇందిరా దేవి మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ మొత్తం కన్నీటి పర్యంతం అయ్యింది. కృష్ణ- మహేశ్‌బాబులకు తమ సానుభూతి తెలియజేస్తున్నారు ఇండస్ట్రీ పెద్దలు. ఇదిలా ఉండగా… తల్లిని చివరి చూపు చూసుకుంటూ మహేష్ బాబు ఇంకా ఆయన కూతురు సితార ఎమోషనల్ కు గురైన వీడియో ఒకటి కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.


మహేష్ బాధని దిగమింగుకొని చాలా నిరుత్సాహకంగా కనిపిస్తుండగా సితార మాత్రం తన నాయనమ్మను చూసి కన్నీరుమున్నిరవుతుంది. సితారని ఓదారుస్తూ వున్న మహేష్ ఎమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.చాలా సందర్భాల్లో తన తల్లితో ఉన్న అనుబంధం గురించి మహేష్ చెప్పుకొచ్చాడు.తల్లి చేతి కాఫీ తనకు గుడిలో ప్రసాదంతో సమానం అని భరత్ అనే నేను టైం నుండి చెబుతూనే వచ్చాడు. కన్నతల్లి తన పిల్లలందరినీ సమానంగానే చూస్తుంది కానీ చిన్నోడు అనేసరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మహేష్ పై ఇందిర గారు చూపించిన ప్రేమ కూడా అలాంటిదే.అందుకే తన తల్లిని చివరి చూపు చూసినప్పుడు మహేష్ చాలా ఎమోషనల్ అయ్యాడు. మహేష్ అమ్మ గారు ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి కలగాలని ఇంకా కృష్ణ గారు ఆయన కుటుంబం ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే శక్తిని ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని మనసారా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: