దుల్కర్ సల్మాన్ తొలి రెమ్యూనరేషన్.. మరీ అంత తక్కువా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోలు ఎన్ని సినిమాలు చేసినా సరైన స్టార్ డమ్ మాత్రం సంపాదించుకోలేకపోతు ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఒకే ఒక సినిమాతో ఊహించని రీతిలో స్టార్ డమ్ వచ్చేస్తూ ఉంటుంది. కాగా మొన్నటికి మొన్న ఒక  సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్నాడు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నట వారసుడు దుల్కర్ సల్మాన్. ఇప్పుడు వరకు ఎన్నో సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇందులో కొన్ని సినిమాలు విజయం కూడా సాధించాయి.

 కానీ ఎందుకో దుల్కర్ సల్మాన్ కి మాత్రం అనుకున్నంతగా గుర్తింపు మాత్రం రాలేదు అని చెప్పాలి. కానీ ఇటీవల సీతారామం అనే ఒక మెలోడీ లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు దుల్కర్ సల్మాన్ కు ఇప్పటివరకు చేసిన సినిమాలలో వచ్చిన క్రేజీ ఒక ఎత్తయితే ఇక సీతారామం సినిమాతో వచ్చిన క్రేజ్ మరో ఎత్తు అని చెప్పాలి. ఇక టాలీవుడ్ లో సైతం ఎన్నడూ లేనివిధంగా ఈ సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్నాడు దుల్కర్.

 ఇకపోతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తొలి రెమ్యూనరేషన్ కు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. తన తొలి రెమ్యూనరేషన్ 2000 రూపాయలు అంటూ చెప్పుకొచ్చాడు. 10 సంవత్సరాలు వయస్సులో ఉన్న సమయంలో రాజీవ్ మీనన్ యాడ్ ఏజెన్సీ వాళ్ళు మా పాఠశాలకు వచ్చారు. ఇక ఆ యాడ్ ఏజెన్సీ వాళ్ళ ఎంపిక చేసిన వారిలో నేను కూడా ఒకడిని. ఇక యాడ్ లో పనిచేసినందుకుగాను 2000 రూపాయలు ఇచ్చారు. ఇక అప్పట్లో 2000 రూపాయలు రెండు కోట్లతో సమానం అని అనిపించింది. 2000 రూపాయలలో 500 రూపాయలు అమ్మమ్మకు  ఇచ్చి తర్వాత అమ్మకు మిగతావి ఇచ్చాను. ఇక తర్వాత ఎప్పుడు బయటకి వెళ్ళినా ఆ డబ్బులతోనే అమ్మని ఏదైనా కొనివ్వు అని అడిగేవాడిని అంటూ దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: