బాలయ్య రికార్డును ఎన్టీఆర్ బ్రేక్ చేయగలడా..?

Anilkumar
ప్రెజెంట్ టాలీవుడ్  సినిమా ఇండస్ట్రీలో రీ - రిలీజ్ ట్రెండ్ సెన్సేషనల్ గా మారింది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అభిమానులు కూడా ఈ రీ రిలీజ్ ట్రెండ్‌కి బ్రహ్మరథం పడుతున్నారు.ఇక  టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు`పోకిరి` సినిమాతో ఈ ట్రెండ్ ప్రారంభమైంది.ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ `జల్సా` సినిమా.. ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణ బాలకృష్ణ `చెన్నకేశవరెడ్డి` సినిమా కూడా రీ రిలీజ్ అయ్యాయి. అయితే  ఇక టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ `జల్సా` సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేసిన నేపథ్యంలో

 ఆ రికార్డును తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ  `చెన్నకేశవరెడ్డి` సినిమా ఆ రికార్డ్ బ్రేక్ చేసింది.ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ  `చెన్నకేశవ రెడ్డి` సినిమా రికార్డును అదే నందమూరి ఫ్యామిలీ కి చెందిన ఎన్టీఆర్ తన `ఆది` సినిమాతో రికార్డును బ్రేక్ చేసేందుకు త్వరలోనే రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే `ఆది` సినిమా విడుదలై 21 ఏళ్లు పూర్తయ్యాయి. గత ఏడాది 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సంబరం భారీగానే జరిగింది.అయితే  గతేడాది ఫ్యాన్స్ కోసం మాత్రమే సినిమాను ప్రదర్శించారు.. కానీ ఎక్కువ స్థాయిలో ప్రచారం చేయలేదు.ఇకపోతే ఈ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈసారి మాత్రం

 `ఆది` సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. అయితే అందుకే `ఆది` సినిమా రి-రిలీజ్ కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇప్పటికే బెల్లంకొండ సురేష్ అధికారకంగా ప్రకటించారు.ఇక  నవంబర్ నెలలో ఈ సినిమాను రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు మళ్లీ `ఆది` సినిమాను తీసుకొస్తున్నట్టు చెప్పాడు.అయితే  అప్పట్లో  టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ సరిగా మీసాలు రాకుండానే `ఆది` సంచలన విజయాన్ని సొంతం చేసుకుని ఇండస్ట్రీ హిట్ దక్కించుకోవడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపడేలా చేసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: