మెగాస్టార్ కే షాకింగ్ కండిషన్ పెట్టిన నయనతార....!!

murali krishna
సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉండే పేరు గురించి, క్రేజ్ గురించి, ఫాన్ ఫాలోయింగ్ గురించి.. కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి ఓ చెరగని స్థాయిని మెగాస్టార్ చిరంజీవి తన పేరుపై ముద్రించుకున్నారు.
జనాల మదిలో చిరంజీవి ఎప్పుడు మెగాస్టార్ గాని నిలిచిపోయే విధంగా చెరగని ముద్రను వేయించుకున్నాడు. ఆయన ఎప్పటికీ జనాలు గుండెల్లో గాడ్ ఫాదర్. అయితే అలాంటి చిరంజీవితో నటించే అవకాశం వస్తే ఏ హీరో హీరోయిన్స్ వదులుకోరు. కానీ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార మాత్రం చిరంజీవి సినిమాలో నటించడాని ఇంట్రెస్ట్ చూయించలేదు.
మనకు తెలిసిందే తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్లో చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". ఈ సినిమా అక్టోబర్ 5న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం . అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్స్, పోస్టర్, సాంగ్స్, ట్రైలర్ అన్ని ఆకట్టుకున్నాయి . త్వరలోనే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్ . అయితే ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మనకు తెలిసిందే ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తుంది కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార . అయితే ఈ పాత్రకు నయనతార కన్నా ముందు బోలెడు మంది హీరోయిన్స్ అనుకున్నారట.. రష్మిక, సాయి పల్లవి , నిత్యమీనన్ ఇలా బోలెడు మంది హీరోయిన్స్ అనుకున్నారట . కానీ నయనతార అయితేనే ఈ పాత్రకు తగిన న్యాయం చేస్తుందని ..ఆమె వద్దకు మేకర్స్ వెళ్లి కథ వివరించగా నయనతార మొదట ఈ కథను రిజెక్ట్ చేసిందట. చిరంజీవితో హీరోయిన్ గా చేసి మళ్ళీ ఆయనతో చెల్లెలుగా చేయడం బాగోదు జనాలు చూడలేరు అంటూ వద్దనిందట.
అయితే మెగాస్టార్ స్వయంగా కాల్ చేసి రిక్వెస్ట్ చేయడంతో నయనతార ఒప్పుకున్నట్లు సమాచారం .అంతేకాదు దీనికోసం ఆమె కొన్ని కండిషన్స్ కూడా పెట్టిందట. కాల్ షీట్స్ లిమిటెడ్ గానే ఇస్తాను అంటూ ..అవుట్ డోర్ షూటింగ్స్ కి రాను అంటూ.. రెమ్యూనరేషన్ తన అడిగినంత ఇవ్వాలి అని అంటూ కండిషన్స్ పెట్టిందట. వీటన్నింటికి ఒప్పుకుంటేనే నయనతార చిరంజీవి పక్కన చేస్తాను అన్న కండిషన్ పెట్టింది అంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. మరి చూడాలి ఇన్ని కండిషన్స్ పెట్టి ఒప్పించుకుని సినిమాల్లో నటిస్తున్న నయనతార ఏ మేర జనాలను మెప్పిస్తుందో చూడాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: