'ఖైదీ 2' పై క్లారిటీ ఇచ్చిన కార్తీ..!

Pulgam Srinivas
కోలీవుడ్ నటుడు అయినటు వంటి కార్తీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీ ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి మార్కెట్ ను సృష్టించు కున్నాడు. కార్తీ కెరియర్ లో మంచి విజయవంతం అయిన మూవీ లలో ఖైదీ మూవీ ఒకటి. 2019 వ 

సంవత్సరంలో విడుదల అయిన ఖైదీ మూవీ అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగు లో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఈ మూవీ కి కోలీవుడ్ స్టార్ దర్శకులలో ఒకరు అయినటు వంటి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి గాను హీరో కార్తీ కి , దర్శకుడు లోకేష్ కనకరాజ్ కి అద్భుతమైన గుర్తింపు మరియు అద్భుతమైన ప్రశంసలు కూడా దక్కాయి. ఇది ఇలా ఉంటే ఖైదీ మూవీ కి పార్ట్ 2 ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే ఖైదీ మూవీ తర్వాత  లోకేష్ కనకరాజ్ ,  దళపతి విజయ్ తో మాస్టర్ మూవీ ని తెరకెక్కించాడు.

ఆ తర్వాత కమల్ హాసన్ తో విక్రమ్ మూవీ ని తెరకెక్కించాడు. మరి కొన్ని రోజుల్లో దళపతి విజయ్ తో మరో మూవీ ని తెరకెక్కించ బోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ 'ఖైదీ పార్ట్ 2' మూవీ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని చెప్పు కొచ్చాడు. ఖైదీ పార్ట్ 2 మూవీ వచ్చే సంవత్సరం స్టార్ట్ కాబోతున్నట్లు హీరో కార్తీ తాజాగా తెలియజేశారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఖైదీ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఖైదీ పార్ట్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: