ఘోస్ట్ సినిమా హిందీ విడుదలకు సిద్దమైన నాగార్జున...!!

murali krishna
టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. బాలీవుడ్ లో ఆయన అప్పుడప్పుడు నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా విడుదలైన 'బ్రహ్మాస్త్ర' సినిమాలో కీలక పాత్ర పోషించారాయన.


ఈ సినిమా బాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగానే ఆడింది. అయితే ఇప్పుడు నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమాను హిందీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. నాగార్జున పట్టుద ల, కోరిక కారణంగానే ఈ సినిమా ను హిందీలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.


నిజాని కి 'ది ఘోస్ట్' సినిమా హిందీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను ఎప్పుడో అమ్మేశారట.. ఇప్పుడు హిందీలో సినిమాను రిలీజ్ చేయాలంటే నిర్మాత ల వల్ల సాధ్యం కాదు. హిందీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ కొనుక్కున్న బయ్యర్ వల్ల మాత్రమే కుదురుతుంది. అందుకే ఆ బయ్యర్ ను హైదరాబాద్ కు పిలిపించి.. 'ది ఘోస్ట్' సినిమాను చూపించినట్లు తెలుస్తోంది. అలా చూపించి.. బాలీవుడ్ లో హిందీ వెర్షన్ ను రిలీజ్ చేయడానికి ఒప్పించినట్లు సమాచారం.


హిందీ లో సినిమా హిట్ అయి.. డబ్బులు వస్తే ఓకే. అలా కాకపోతే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో నాగ్.. సదరు బయ్యర్ తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బహుశా.. నష్టాలను తాను భరిస్తానని నాగార్జున చెప్పి ఉంటార ని టాక్. ఈ సినిమాపై నాగార్జున చాలా నమ్మకంగా ఉన్నారట  


అందుకే విశాఖ ఏరియాలో నాగార్జున స్వయంగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించింది. ఇటీవల విడుదలై సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది. అక్టోబర్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట.మరి చూడాలి లేట్ వయసులో కూడా యంగ్ హీరోలోతో పోటీ పడే నాగార్జునకు ఎలాంటి విజయం అందుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: