ఆ స్టార్ హీరో ఇంట్లో... టీం ఇండియా సందడి... వైరల్ అవుతున్న పిక్స్...

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన 'రామ్ చరణ్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తన నటనతో ప్రత్యేక స్థానం సంపాదించారు. 'మగధీర' సినిమాతో స్టార్ హోదాను అందుకున్న చరణ్.. 'రంగస్థలం' చిత్రంతో మరో మెట్టు ఎక్కారు. ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్‌కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేవలం తెలుగులోనే మాత్రం కాకూండా.. బాలీవుడ్‌లో కూడా భారీ హిట్ కొట్టింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా రికార్డుల వర్షం కురిపించింది. విదేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ సత్తాచాటింది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. వారిద్దరి యాక్టింగ్‌కు ఇండియన్‌ క్రికెటర్లు కూడా ఫిదా అయిపోయారు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా ఆర్ఆర్ఆర్ స్టార్లను ప్రముఖులు కలుస్తూ వస్తున్నారు. ఈ క్రంమలోనే భారత ప్లేయర్స్ కలిశారు.
ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత స్టార్ క్రికెట్సర్స్ హార్థిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ సహా మరికొందరు ప్లేయర్స్.. నేరుగా రామ్ చరణ్‌ ఇంటికి వెళ్లారు. చరణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా వారు కలిశారు. ఇందుకు సంబంధించి మెగా ఫ్యామిలీ సన్నిహితులు పాండ్యాతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.
ఉప్పల్‌ మ్యాచ్‌లో విజయం సాధించినందుకు హార్దిక్‌పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్‌తోపాటు పలువురు ఆటగాళ్లను రామ్ చరణ్‌-ఉపాసన దంపతులు అభినందించి సన్మానించిచారట. వారితో కాసేపు సరదాగా మాట్లాడారట. భారత క్రికెటర్ల కోసం చరణ్‌ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారట. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ పార్టీలో పాల్గొన్నారని సమాచారం. ఈ పార్టీ ఫొటోలను పవర్ స్టార్ ఈరోజు మధ్యాహ్నం అధికారికంగా షేర్‌ చేయనున్నారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: