పెళ్లి కాకుండానే మరోసారి తల్లి కాబోతున్న రామ్ చరణ్ హీరోయిన్..?

Anilkumar
ఇండస్ట్రీ వాళ్లకు ఏదైనా త్వరగా కావాలి. అంతేకాదు దానికి సంప్రదాయాలు, కట్టుబాట్లు అవసరం లేదు.ఇక  మనసులో అనుకున్నామా చాలు.వెంటనే అయిపోవాలి.వారికి ఏదైనా అడ్డంకులు వచ్చినా.. ఎవరైనా ప్రశ్నించినా నా లైఫ్ నా ఇష్టం. ఎవరు నా జీవితాన్ని డిసైడ్ చేయడానికి అంటూ ఏకంగా రీల్‌లో చెప్పిన డైలాగ్స్ మనకు వాడుతారు. ఇండస్ట్రీలో కొందరు హీరో హీరోయిన్లు పెళ్లి కాకుండానే పిల్లలకు జన్మనిస్తున్నారు.అయితే గతంలో హీరో కమల్ హాసన్ ఇదే విధంగా చేయగా..మరో ఫారిన్ బ్యూటీ కూడా ఇలాగే చేసిన విషయం తెలిసిందే.ఇదిలావుంటే ఇక అమీ జాక్సన్.. ఈ అమ్మడి పేర వినే ఉంటారు.
ఈమె  తమిళ, తెలుగు, బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసింది. ఇక ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. అయితే అప్పట్లో శంకర్ దర్శకత్వంలో ఈ బ్యూటీ చాలా సార్లు వెండితెరపై సందడి చేసింది.ఇకపోతే  రజినీకాంత్ సరసన రోబో -2, విక్రమ్ సరసన -ఐ సినిమాలో కనిపించింది. ఇక హీరో ధనుష్, తెలుగులో రాంచరణ్‌తో ఎవడు సినిమాలో కూడా చేసింది. అయితే ప్రస్తుతం ఈ అందాల తార ఒక బిడ్డకు జన్మనిచ్చి మరోసారి బిడ్డకు జన్మ నిచ్చేందుకు రెడీగా ఉందట.. అది కూడా పెళ్లి చేసుకోకుండానే అని వార్తలు వస్తున్నాయి. ఇక.గతంలో అమీ జాక్సన్ పెళ్లిచేసుకోకుండానే బిడ్డకు జన్మనిచ్చి సంచలనానికి తెరలేపింది.

ఆమె బిడ్డ జన్మించాక పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది.  ఇంతవరకు ఆమె పెళ్లి గురించి టాక్ రాలేదు. అయితే అమీజాక్సన్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్న తరుణంలో బడా వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో పడింది. ఇక వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.ఇకపోతే చాలా కాలం డేటింగ్ లో ఉన్న ఈ జంట.. ఆ తర్వాత ఒక బాబుకు తల్లిదండ్రులు అయ్యారు.  గర్భవతిగా ఉన్న అమీ జాక్సన్ బిడ్డ పుట్టాక పెళ్లి చేసుకుంటామని తెలిపింది. బిడ్డ పుట్టాక జార్జ్ అమీని వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది.అయితే కొంత కాలం బాధపడిన అమీ ప్రస్తుతం హాలీవుడ్ నటుడు ఎడ్వెస్టిక్ తో ఎఫైర్‌లో ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇక ఇతని వలన కూడా ఆమె మరో బిడ్డకు తల్లికాబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇక వీరు అయినా పెళ్లి చేసుకుంటారో లేదో వేచిచూడాల్సిందే..!!.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: