గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి ఎవరు..?

Divya
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక చిరంజీవి నటించిన గత చిత్రం ఆచార్య ప్లాప్ కావడంతో ఈ సినిమా పైన మరింత నమ్మకాన్ని పెట్టుకున్నారు అభిమానులు. ఇక గాడ్ ఫాదర్ చిత్రాన్ని డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో నయనతార కీలకమైన పాత్రలో నటిస్తోంది. అతిధి పాత్రలో మాత్రం సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. ఇక వీరితో పాటు పూరి జగన్నాథ్ ,సునీల్ కూడా నటిస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అయితే ఈ క్రమంలోని ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో అనంతపూర్ జిల్లాలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 28వ తేదీన అనంతపూర్ లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. అది కూడా సాయంత్రం 6 గంటలకు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా వేడుకకు ముఖ్యఅతిథిగా పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.. అయితే పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో తన పనిని డిస్టర్బ్ చేయవద్దని చిరంజీవి కూడా తెలియజేసినట్లు సమాచారం.

అయితే ఈ క్రమంలోని ఎవరు ముఖ్యఅతిథిగా వస్తారు అనే విషయంపై చిత్ర బృందం ఇంకా అధికారికంగా తెలియజేయలేదు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన బహుశా సల్మాన్ ఖాన్ కి హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నయనతార వివాహమైన తర్వాత తన మనసు మార్చుకొని తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుందేమో చూడాలి. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు ఎవరు హాజరు కాబోతున్నారని విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారు తోంది. అయితే అనంతపురంలో ఈవెంట్ నిర్వహించడం అభిమానులకు చాలా సంతోషాన్ని ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: