రోజాను టార్గెట్ చేసిన బాలయ్య ఫ్యాన్స్....!!

murali krishna
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయం కలకలాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
అధికార వైసీపీ తమ నిర్ణయాన్ని సమర్థించుకునే పనిలో ఉంటే తెలుగుదేశం మాత్రం ఆ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఊరుకునేది లేదంటూ నిరసనలకు చేస్తూ దిగుతోంది. అయితే ఈ విషయం మీద జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ వంటి వారు స్పందించారు.
మిగతా ఎవరు స్పందించినా ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన లేదు కానీ నందమూరి బాలకృష్ణ స్పందించినప్పటి నుంచి పెద్ద ఎత్తున ఆయనను టార్గెట్ చేస్తూ మంత్రులందరూ వరుసగా పోస్టులు చేయడం చాలా ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో ఆయనతో కొన్ని సినిమాల్లో నటించిన మంత్రి రోజా చేసిన పోస్ట్అ లాగే నందమూరి బాలకృష్ణ గురించి ఆమె చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. బాలయ్య, ఫ్లూట్ బాబు ముందు ఊదు జగనన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు జ'గన్' అనే రియల్ సింహం తేడా వస్తే దబిడి దిబిడే అంటూ రోజా పోస్ట్చే శారు.
ఇక ఈ పోస్ట్కి  తెలుగుదేశం నేతలు పొలువురు టిడిపి మద్దతుదారులు గట్టిగానే కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఈ రోజు ఉదయం సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు సింహాచలం వెళ్ళిన మంత్రి రోజా అక్కడ కూడా బాలకృష్ణను విమర్శిస్తూ కామెంట్లు చేశారు. వైసీపీ నాయకులను కుక్కలలా మొరుగుతారని బాలకృష్ణ అనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ముందుగా మీ తండ్రి మరణానికి కారకుడైన చంద్రబాబు మీద పగ తీర్చుకోమని రోజా బాలయ్య కు సలహా ఇచ్చారు.
చంద్రబాబు రైతుల పేరుతో దొంగ యాత్రలు చేయిస్తున్నాడని విమర్శించిన ఆమె తన సామాజిక వర్గానికి తన, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుపడాలని ఆనాడు తాత్కాలిక రాజధాని పేరుతో అమరావతిలో భూములు కొని వ్యాపారం చేశారని ఆమె అన్నారు. ఇప్పటికీ కొంత మంది రైతులను మోసం చేస్తూ వారిని ఉసిగొలుపుతూ మూడు రాజధానులను అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించిన ఆమె ఆరు నూరైనా విశాఖను పరిపాలనా రాజధాని చేసి తీరుతామని అన్నారు.
అమరావతిలో మాత్రమే రైతులు ఉన్నారా? రాయలసీమ, ఉత్తరాంధ్రలో లేరా రైతులు అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై చంద్రబాబు కుటుంబం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటూ ఆమె కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం మీద నందమూరి బాలకృష్ణ ఎలా స్పందిస్తారని వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: