రెండో పెళ్ళికి రెడీ అయిన సమంత.. వరుడు ఎవరో తెలుసా...?

murali krishna
సమంత రెండో పెళ్లి వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది. అయితే దీన్ని పుకారుగా కొట్టిపారేయలేం, దానికిదే నిదర్శనం అంటున్నారు.
వయసు కాని వయసులో సమంతకు విడాకులయ్యాయి. ఆమె ప్రస్తుత వయసు 35 ఏళ్ళు. లేటు చేస్తే ఏజ్ బార్ అవుతుంది కాబట్టి, రెండో పెళ్ళికి ఇదే సరైన సమయం. ఈ క్రమంలో ఆమె కూడా పెళ్లి నిర్ణయం తీసుకున్నారట. జీవితానికి సంబంధించిన ఈ కీలక విషయంలో సమంత సద్గురు బాబా సలహా తీసుకున్నారట. ఆయన కోరిక మేరకు, నిర్ణయించిన అబ్బాయితో ఏడడుగులు వేయనున్నారట సమంత.

ఇక సమంత వివాహం చేసుకోబోయే వ్యక్తి చెన్నైకి చెందిన బడా వ్యాపారవేత్త అట. ఆయనతో సమంత వివాహం దాదాపు ఖాయమే అంటున్నారు సమంత తల్లి. సమంత టీం ఈ విషయాన్ని ఖండించకపోవడమే నిదర్శనం అంటున్నారు. ఇటీవల సమంత ఆరోగ్యంపై అనేక పుకార్లు వచ్చాయి. ఆమె అరుదైన స్కిన్ డిసీజ్ తో బాధపడుతున్నారని, చికిత్స కోసం అమెరికా వెళ్లారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను సమంత మేనేజర్ ఖండించారు. సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. చికిత్స కోసం అమెరికా వెళ్లారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చిపారేశారు.!
సమంత రెండో పెళ్లి కథనాలపై మాత్రం వారు మౌనం వహించారు. దీంతో సమంత పెళ్లి చేసుకుంటున్నారనే విషయాన్ని కొట్టిపారేయలేమనేది టాలీవుడ్ వర్గాల అభిప్రాయం. మరోవైపు నాగ చైతన్య వివాహం చేసుకోనున్నారని వార్తలు వస్తుండగా సమంత ఆయన కంటే ముందు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేస్తూ ఉండవచ్చు. ఎందుకంటే సమంత మాజీ భర్తపై రగిలిపోతుంది. నాగ చైతన్య పై కోపాన్ని ఇటీవల బాలీవుడ్ షో కాఫీ విత్ కరణ్ లో నేరుగా చూపెట్టారు. మీ భర్త నాగ చైతన్య అని హోస్ట్ కరణ్ సంబోధించగా… భర్త కాదు మాజీ భర్త అన్నారు. అంతటితో ఆగకుండా చైతూ, నేను ఒకే గదిలో ఉండాల్సి వస్తే అక్కడ పదునైన కత్తులు ఉంచాలి అన్నారు. మగాళ్ల బుద్ధి అలాంటిదే, వాళ్లపై కోపంతోనే 'ఊ అంటావా మామా ఊ ఊ అంటావా మామ' సాంగ్ చేశానని పరోక్షంగా నాగ చైతన్యను ఉద్దేశించి మాట్లాడారు.
కావున నాగ చైతన్యపై పంతంతో కూడా సమంత మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. విడాకులు ప్రకటన నాటి నుండి వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనేది నిజం. గత అనుభవాల రీత్యా జీవితంలో సమంత పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు గతంలో వార్తలు రావడం కొసమెరుపు. విడాకుల తర్వాత పూర్తి ఫోకస్ కెరీర్ పై పెట్టిన సమంత వరుస ప్రాజెక్ట్స్ ప్రకటించారు. మైథలాజికల్ మూవీ శాకుంతలం నవంబర్ 4న విడుదల కానుంది. అలాగే సైకలాజికల్ థ్రిల్లర్ యశోద విడుదలకు సిద్దమవుతుంది. ఇక విజయ్ దేవరకొండకు జంటగా చేస్తున్న ఖుషి చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇవన్నీ పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: