రాజమౌళి సక్సెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసా...?

murali krishna
ప్రపంచంలో ఏ దర్శకుడికి లేని అరుదైన ఘనత రాజమౌళి సొంతం. 20 ఏళ్ల కెరీర్లో ఆయన చేసింది కేవలం 12 చిత్రాలు. కానీ సంపాదించిన ఫేమ్ వంద చిత్రాలకు సరిపడే అంత.
సినిమాకో వైవిధ్యమైన సబ్జెక్టు ఎంచుకోవడం, ఎంచుకున్న స్క్రిప్ట్ పక్కాగా తెరకెక్కించడం రాజమౌళి టాలెంట్. దాని కోసం బాగా కష్టపడతారు. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త తీసుకుంటారు. సినిమా పర్ఫెక్ట్ గా రావడానికి అవసరమైన ఇతర క్రాఫ్ట్స్ పై కూడా రాజమౌళి ప్రావీణ్యం సాధించాడు. నటుల పెర్ఫార్మన్స్ అయినా… సాంకేతిక నిపుణుల పనితనమైనా నచ్చకపోతే ఊరుకోరు. కోరుకున్న అవుట్ ఫుట్ వచ్చేవరకూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ అరుదైన లక్షణాలు ఆయనను అపజయం ఎరుగని దర్శకుడు చేశాయి.
అయితే బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి అంతర్జాతీయ స్థాయి చిత్రాలు తెరకెక్కించడంలో తల్లి ప్రోత్సాహం ఎంతో ఉందని రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. చైల్డ్ హుడ్ లో మదర్ తనని గైడ్ చేసిన విధానం సృజనాత్మకత పెంచి మంచి మంచి సినిమాలు తెరకెక్కించడానికి కారణమైందని ఆయన చెప్పారు. చదువుకునే రోజుల్లో రాజమౌళి తల్లిగారు రోజూ స్కూల్ కి వెళ్లు, హోమ్ వర్క్ చెయ్, బాగా చదువని ఇబ్బంది పెట్టలేదట. ఖాళీగా కూర్చుంటే ఆమె రెండే సూచనలు చేసేవారట. ఒకటి బయటికెళ్లి ఆడుకో లేదా కామిక్స్ చదువు అనేవారట.
రాజమౌళి మదర్ కామిక్స్, స్టోరీ బుక్స్ చదువు అని ఎప్పుడూ ఒత్తిడి పెట్టేవారట. దాంతో రాజమౌళి పుస్తకాల పురుగయ్యారట. తన చేతిలో బుక్ ఉంటే చాలు దాన్ని పూర్తిగా చదివేసేవాడట. ఆ విధంగా తన తల్లి ఓ గొప్ప దర్శకుడు కావడానికి పునాది వేసింది. ఈ స్థాయికి రావడానికి కారణమయ్యారని రాజమౌళి చెప్పుకొచ్చారు. సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా క్లాస్ బుక్స్ చదవాలని కోరుకుంటారు. బాగా చదివి పిల్లలు ఏ డాక్టరో, ఇంజనీరో కావాలని ఆశపడతారు. దానికి భిన్నంగా రాజమౌళిని ఆయన తల్లి కామిక్స్ చదివేలా ప్రోత్సహించింది.

ఇక సినిమా పరిశ్రమలో పుట్టి పెరిగిన రాజమౌళి అనేక విభాగాల్లో పని చేసి మేకింగ్ పై పట్టు సాధించారు. ఈ జెనరేషన్ దర్శకుల్లో రాజమౌళి కంటే ప్రేక్షకుల పల్స్ తెలిసిన మరొక దర్శకుడు లేదు. సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి గ్లోబల్ రేంజ్ కి వెళ్లారు. వివిధ అంతర్జాతీయ సినిమా వేదికలపై మాట్లాడే గౌరవం సంపాదించారు. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని నమ్మే రాజమౌళి 2012 నుండి 2022 వరకు కేవలం మూడు చిత్రాలు విడుదల చేశారు. దశాబ్ద కాలంలో బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. గత చిత్రాలకు మించి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇది ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని ఇప్పటికే ఆయన క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: