ఆ పాత్ర చేయనంటే చేయను అని చెప్పిన పూరి...!!

murali krishna
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో వరుసగా సినిమాలలో నటిస్తూ అభిమానులకు సంతోషం కలిగే ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. చిరంజీవి రీమేక్ లను ఎంచుకోవడంపై కొంతమంది విమర్శలు చేసినా మాస్ ప్రేక్షకులకు నచ్చే కథలకు చిరంజీవి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం విశేషం.


గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 25వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీముఖి చిరంజీవిని ఇంటర్వ్యూ చేస్తున్న ప్రోమో రిలీజైంది.


ప్రోమోలో శ్రీముఖి చిరంజీవికి ఐలవ్యూ చెప్పడం గమనార్హం. ఈ లుక్ లో మీరు చాలా హాట్ గా ఉన్నారని శ్రీముఖి చెప్పగా చిరంజీవి వెరైటీ ఎక్స్ ప్రెషన్లు ఇచ్చారు. సినిమాలో హీరోయిన్ లేదని సాంగ్స్ లేవని అలోచన రాకుండా సినిమా ఉంటుందని చిరంజీవి వెల్లడించడం గమనార్హం. సల్మాన్ ఖాన్ ప్రేమతో గాడ్ ఫాదర్ సినిమాలో నటించాడని ఆయన అన్నారు. సల్మాన్ ఖాన్ కు చిరంజీవి హ్యాట్సాఫ్ చెప్పారు. జర్నలిస్ట్ పాత్రలో పూరీ జగన్నాథ్ ను చేయాలని కోరిన సమయంలో


సార్ నేను చస్తే చేయను సార్ అని ఆయన అన్నాడని చిరంజీవి చెప్పుకొచ్చారట.. పూరీ జగన్నాథ్ లో కమాండింగ్ ఉన్న నటుడు ఉన్నాడని సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే ఆశ్చర్యపోతారని చిరంజీవి కామెంట్లు కూడా చేశారు. ఈ సినిమాకు థమన్ ఆరో ప్రాణమని చిరంజీవి కామెంట్లు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే గాడ్ ఫాదర్ మూవీ నిశ్శబ్ద విస్పోటనం అని చిరంజీవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఫుల్ ఇంటర్వ్యూ రిలీజైతే ఈ వీడియో గాడ్ ఫాదర్ సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. చిరంజీవికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా గాడ్ ఫాదర్ సినిమాతో మెగాస్టార్ ఖాతాలో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఖాయమని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. సినిమాసినిమాకు చిరంజీవి రేంజ్ అంతకంత కూ పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: