ప్రాజెక్ట్ కే విషయంలో నాగ్ ఫీలింగ్ అదేనట!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా ప్రాజెక్టు కే సినిమా శెరవేగంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు క్రేజీ ప్రాజెక్టులో ఈ సినిమా కూడా ఒకటి. సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా కు నాగ్ అశ్విన్ దర్శకత్వం అందిస్తూ ఉండగా ఈ సినిమా తప్పకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు.

కొన్ని చిన్న సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ దర్శకుడు మహానటి సినిమాతో జాతీయ పురస్కారాన్ని అందుకొని ఎంతగానో ఆకట్టుకున్నాడు. సినిమాల పట్ల మంచిగా అభిరుచి కలిగి ఉన్న ఈ దర్శకుడు ప్రభాస్ తో సినిమా ఓకే చేయడం నిజంగా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. పాన్ ఇండియా హీరోగా ఎంతో సత్తా చాటుతున్న ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటి ఓ కథను సిద్ధం చేసి ప్రభాస్ తో సినిమా చేయడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. 

మరి ఈ సినిమా కథ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింటా ఎంతో ట్రెండ్ గా మారిపోయింది.  నాగ్ అశ్విన్ ప్రాజెక్టుకే సినిమా విషయంలో ప్రభాస్ అవలంబించే పద్ధతుల పట్ల ఎంతో నిరాశగా ఉన్నాడట. వాస్తవానికి ఈ సినిమా యొక్క అనౌన్స్మెంట్ ఇచ్చి సంవత్సరన్నర దాటిపోయింది. అప్పటినుంచి ఈ సినిమా మొదలు పెట్టని ప్రభాస్ ఇటీవల ఈ చిత్రాన్ని మొదలు పెట్టాడు. అయితే వెంటనే ఈ సినిమాను పూర్తిచేసి విడుదల చేయవలసిందిగా కోరగా ఈ సినిమాను 2024వ సంవత్సరానికి పోస్ట్ ఫోన్ చేయడం నిజంగా ఆయనను నిరాశపరిచిందట. ఒక ప్రాజెక్టు కోసం ఇన్ని రోజులు పనిచేయడం తనకు ఏమాత్రం నచ్చడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: