కమర్షియల్ మూవీతో రానున్న అల్లు శిరీష్...!!

murali krishna
అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ హీరో గా పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఆయన కు కమర్షియల్ సక్సెస్ ని ఇవ్వలేక పోయాయి


అయినా కూడా తన సొంత బ్యానర్ ఉండడం తో వరుసగా సినిమా లను చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన ఒక సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. మొన్నటి వరకు ఆ సినిమా కు ప్రేమ కాదంట అనే టైటిల్ ని ప్రచారం చేశారు, కానీ ఇప్పుడు టైటిల్ మార్చినట్లుగా తెలుస్తుంది. అల్లు శిరీష్ అను ఎమాన్యుల్ జంటగా నటించిన ఈ సినిమా కు సంబంధించిన టైటిల్ విషయం లో అతి త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ తాజాగా మెగా కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.


ఈ సినిమా ను నవంబర్ 4 వ తారీఖున విడుదల చేయబోతున్నట్లుగా క్లారిటీ కూడా ఇచ్చారు. గత కొన్ని నెల లుగా ఈ సినిమా ను వాయిదా వేస్తూ వచ్చారు. షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలమైంది, కరోనా ముందు ఈ సినిమా ను మొదలు పెట్టారు. ఈ సినిమా సమయం లోనే అను ఎమాన్యుల్ తో అల్లు శిరీష్ ప్రేమ లో ఉన్నాడు అంటూ గుస గుసలు వచ్చాయి. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వచ్చే నెల రెండో వారం లేదా మూడవ వారం నుండి మొదలు పెట్టే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారట.. అయితే ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోయిన్ పాల్గొంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ హీరోయిన్ కనుక ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుంటే కచ్చితంగా ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది అని కొందరు అయితే అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా తో అయినా అల్లు శిరీష్ కమర్షియల్ గా సక్సెస్ అవుతాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: