నాగార్జున 'ది ఘోస్ట్' మూవీని నార్త్ అమెరికాలో విడుదల చేయనున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా ది ఘోస్ట్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సోనాల్ చౌహన్ , నాగార్జున సరసన హీరోయిన్ గా నటించగా ,  టాలీవుడ్ యంగ్ దర్శకులలో ఒకరు అయినటు వంటి ప్రవీణ్ సత్తార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని దర్శకుడు ప్రవీణ్ సర్దార్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను మూవీ యూనిట్ విడుదల చేయగా ఈ ప్రచార చిత్రాలలో ఎక్కువ శాతం యాక్షన్ సన్నివేశాలే ఉన్నాయి. దానితో ఈ మూవీలో అంతకుమించిన యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి నాగార్జున ,  సోనాల్ చౌహాన్ కు సంబంధించిన ఒక రొమాంటిక్ లిరికల్ సాంగ్ ను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.
 

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను అక్టోబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 25 వ తేదీన కర్నూల్ లో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా మూవీ యూనిట్ ఇప్పటికే చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని నార్త్ అమెరికాలో శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేయబోతుంది. ఈ విషయాన్ని శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. నార్త్ అమెరికాలో ఈ మూవీ ప్రీమియర్స్ ని అక్టోబర్ 4 వ తేదీని వేయనున్నారు. ఈ విషయాన్ని కూడా సంస్థ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: