గాడ్ ఫాదర్ తక్కర్ మార్.. భారీ గా ట్రోల్ అవుతుందిగా!!

P.Nishanth Kumar
కొన్ని సార్లు ఎంత పెద్ద స్టార్స్ అయినా కూడా ట్రోల్స్ కి గురవుతూ ఉండడం ఇటీవల కాలంలో జరుగు తుంది. పెద్ద హీరోలు పెద్ద సాంకేతిక నిపుణులు అని చూడకుండా ట్రోల్స్ చేసేవారు వారిపై దారుణంగా టోన్స్ చేయడం జరుగుతుంది. అలా ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాపై ఎంతగా ట్రోల్స్ నమోదు అవుతున్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సినిమాకు మొదటి నుంచి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లేదు అని చెప్పడానికి ఈ రకమైన ట్రోల్స్ ఉదాహరణ.

మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై మొదటినుంచి నెగిటివిటీ అలుముకొంది. కారణం ఏ దైనా కూడా ఈ సినిమాకు ఈ స్థాయిలో బస్ లేకపోవడం అనేది నిజంగానే అభిమానులను నిరాశ పరిచే విషయం అవడం ఆ సినిమా కూడా భారీ సక్సెస్ రాకపోవడం.. దానిని తెలుగులో ఏరి కోరి మరి సెలెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ఇలాంటి వాదన వచ్చింది అని కొంతమంది చెబుతున్నారు. మరి తొందరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అలాగే టైలర్ విడుదల కాబోతున్న నేపథ్యంలో అవైనా ఈ సినిమాకు మినిమం బజ్ క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.

 ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాట విడుదల అయింది. తమన్ సంగీతం సమకూర్చిన ఈ పాట ప్రేక్షకు లకు ఏమాత్రం నచ్చకపోవడం నిజంగా ఇంకా నిరాశ పరుస్తుంది. సినిమాపై బజ్ రావాలి అంటే తప్పకుండా ఒక భారీ అప్డేట్ ప్రేక్షకులను అలోచించి తీరాల్సిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్న కూ డా ఈ సిని మాకు ఇంకా క్రేజ్ రాకపోవడం దేనికి దారితీస్తుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఆచార్యలు ప్రభావం ఇంకా ఆయనపై ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: