యాంకర్ సుమ.. ఆ ఒక్క విషయంలో సక్సెస్ కాలేక పోతుందా?

praveen
యాంకర్ సుమ.. తెలుగు బుల్లితెరపై ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాదాపు గత రెండు దశాబ్దాల నుంచి బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు సుమా. ఎంతో మంది కొత్త యాంకర్లు వస్తున్నప్పటికీ సుమాకు పోటీ ఇచ్చే వారు మాత్రం ఇప్పటికి కూడా లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడా వల్గారిటీ కి తావు లేకుండా తన వాక్చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది సుమ. ఇక ఎంతలా ప్రభావం చూపింది అంటే సుమా ఏదైనా కార్యక్రమానికి యాంకర్ గా చేస్తుంది అంటే చాలు ఆ షో తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని ప్రేక్షకులు అందరూ భావిస్తూ వుంటారు.

 ఎప్పటికప్పుడు తన స్పాంటేనియస్ పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ తాను యాంకరింగ్ చేస్తున్న షోలకు టాప్ రేటింగ్ వచ్చేలా చేస్తూ ఉంటుంది. అయితే కేవలం బుల్లితెరపై కార్యక్రమాలు మాత్రమే కాదు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో కూడా సందడి చేస్తూ అలరిస్తూ ఉంటుంది సుమా. ఇలా యాంకర్ గా సూపర్ సక్సెస్ అయింది అని చెప్పాలి. ఇలా ఒక వైపు బుల్లితెరపై షోలు మరోవైపు సినిమా ఈవెంట్స్ ద్వారా బాగా సంపాదిస్తున్న సుమా.. ఒక విషయంలో మాత్రం సక్సెస్ కాలేకపోతోంది. తన సొంత బ్యానర్ లో కూడా కొన్ని షోస్ నిర్వహిస్తుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఎందుకో సుమ యాంకరింగ్ చేస్తున్న  షోలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

 దీంతో ఎక్కువ కాలంపాటు బుల్లితెరపై సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సొంత బ్యానర్ షోలు ఎక్కువ రోజులు ప్రేక్షకుల ముందు ఆడలేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా సొంత బ్యానర్ లో నిర్మించిన టీవీ షోస్ సినిమాల వల్లే సుమా కు భారీగా నష్టం వాటిల్లింది అన్న టాక్ కూడా ఉంది. అయితే ఇతర బ్యానర్లో సుమా చేసే ప్రతి షో ప్రతి ఈవెంట్ కూడా సక్సెస్ అవుతుంది. కానీ సొంత బ్యానర్ లో సుమ ఏం చేసినా కూడా కలిసి రావడం లేదు. దీంతో సుమ నిర్మాణ రంగానికి దూరంగా ఉండడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది
 ఇక ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా తన లైఫ్ లో జరిగే అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంది సుమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: