నేను అలాంటి పనులు చేయలేకపోతున్నా..కాజల్.. కారణం..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చందమామ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత మగధీర సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఒక దశాబ్దం పాటు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్గా కొనసాగింది. హీరోయిన్గా బిజీ ఉన్న సమయంలోనే కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడైన కిచ్లును వివాహం చేసుకున్నది. పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్గా ఇమే కంటిన్యూ అవుతుందని ఆమె అభిమానుల సైతం భావించారు. అయితే అంతలోని గర్భం దాల్చడంతో వచ్చిన ఆఫర్లను రిజెక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. గడచిన నాలుగు నెలల క్రితం ఒక బాబుకు కూడా జన్మనిచ్చింది కాజల్ మళ్ళీ ఇప్పుడు సినిమాల్లోకి కోసం పలు ప్రయత్నాలు చేస్తున్నది.

గర్భం దాల్చిన సమయంలో డెలివరీ అయిన సమయంలో కాజల్ శరీరంలో పలుమార్పులు వచ్చాయట. ఈ మార్పులు తిరిగి సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుందని చెప్పవచ్చు. కాజల్ అగర్వాల్ మాత్రం చాలా త్వరగానే పాత స్థితికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇండియన్ -2 సినిమాలు కాజల్ అగర్వాల్ షూటింగ్లో పాల్గొన్నట్లుగా సమాచారం. అయితే ఈ సందర్భంగా గుర్రపు స్వారీ కూడా చేసినట్లుగా అందుకు సంబంధించి వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

అయితే తను ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన బాడీ ఎలాంటి పని చేయడానికి పెద్దగా సహకరించలేదని.. ఎప్పుడు ఎలాంటి వర్కౌట్ చేయాలనుకున్న కూడా కాస్త ఇబ్బందిగానే ఉందట. ప్రతి విషయానికి తన బాడీ సహకరించలేదని ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ ను రాసుకొచ్చింది. అంతేకాకుండా త్వరలోనే తమ అభిమానుల కోసం పూర్తిస్థాయిలో మారి వస్తానని ఆమె తెలియజేసింది. మరి కాజల్ అగర్వాల్ గతంలో మాదిరి ఆఫర్లు అందుకుంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: