మళ్ళీ మెగా ఫోన్ పట్టుకొబోతున్న సీనియర్ డైరెక్టర్....!!

murali krishna
కొన్నేళ్ళ క్రితం సూపర్ హిట్స్ డెలివరీ చేసిన దర్శకు ల్లో సీనియర్ డైరెక్టర్ కే. విజయ్ భాస్కర్ ఒకరు. స్వయం వరం, నువ్వే కావాలి , నువ్వు నాకు నచ్చావ్ , మన్మథుడు, మల్లీశ్వరి ఇలా ఆయన తీసిన సూపర్ హిట్ ఇప్పటికీ ఆడియన్స్ ఫ్రెష్ ఫీల్ కలిగి స్తుంటాయి.
అయితే కొన్నేళ్లు గా విజయ్ భాస్కర్ ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. మన్మథుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రమే మెరిశారు. ఇక విజయ్ భాస్కర్ సినిమాల కు దూరం అని అందరూ అనుకున్నారు.
కానీ ఆయన ఇప్పుడు మళ్ళీ మెగా ఫోన్ పట్టి సినిమా చేసేందు కు రెడీ అవుతున్నాడు. యూత్ ఫుల్ కథ ఒకటి రెడీ చేసుకొని నిర్మాతల ను సెట్ చేసు కున్నారు. తాజాగా పూజా కార్యక్రమాల తో ఆఫీస్ ఓపెన్ చేశారు. దసరా రోజు ఈ ప్రాజెక్ట్ ను లాంచ్ చేయ బోతున్నారు. హీరో హీరోయిన్స్ ఎవరనేది చెప్పలేదు కానీ కొత్తవాళ్ల తోనే ఆయన సినిమా తీసే ఆలోచన లో ఉన్నారని తెలుస్తుంది. ఈ సినిమా తో ఆయన తనయుడు కమల్ ని హీరో గా లాంచ్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.
నిజానికి విజయ్ భాస్కర్ – త్రివిక్రమ్ కాంబో అల్టిమేట్. విజయ్ భాస్కర్ నుండి రైటర్ గా త్రివిక్రమ్ బయటి కి వచ్చేసి దర్శకుడయ్యాక విజయ్ భాస్కర్ సక్సెస్ అందు కోలేక సినిమాలు దూరమయ్యారు. మళ్ళీ ఇన్నాళ్ళ కి ఓ కథ తయారు చేసుకొని ప్రేక్షకుల ముందు కొస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ తో సీనియర్ డైరెక్టర్ మంచి కం బ్యాక్ ఇస్తాడా ? లేదా మిగతా సీనియర్ దర్శకుల్లా గే డిజాస్టర్ డెలివరీ చేసి పక్క కి తప్పుకుంటారా ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: