యూఎస్ఏ లో 'పొన్నియన్ సెల్వన్' బుకింగ్ ల పరిస్థితి ఇదే..!

Pulgam Srinivas
ఇండియా లోనే గొప్ప దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మణిరత్నం ఎన్నో వైవిధ్యమైన మూవీ లకు దర్శకత్వం వహించి ఇటు ప్రేక్షకుల నుండి ...  అటు విమర్శకులం నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా ఇండియా లోనే అద్భుతమైన దర్శకుడు గా గొప్ప పేరును సంపాదించుకున్న మణిరత్నం తాజాగా చియాన్ విక్రమ్ ,  కార్తీ ,  జయం రవి ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష ప్రధాన పాత్రలతో పొన్నియన్ సెల్వన్ అనే మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే.

రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను అదిరిపోయే రేంజ్ లో చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా యూనిట్ చెన్నైలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ముగించింది.  మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ యూనిట్ తెలుగు లో కూడా భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయబోతుంది.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బుకింగ్ లను యుఎస్ఏ దేశంలో తెరిచారు. అందులో భాగంగా ఇప్పటి వరకు ఈ మూవీ కి 350 కే వరకు వసూలు జరిగినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: